Malayalam actress arrested for selling drugs in Kochi - Sakshi
Sakshi News home page

Drugs Case:డ్రగ్స్‌ కేసులో అడ్డంగా దొరికిపోయిన నటి.. దంపతులమని నమ్మించి మరో వ్యక్తితో కలిసి గది అద్దెకు..

Published Wed, Mar 22 2023 12:40 PM | Last Updated on Wed, Mar 22 2023 2:22 PM

Malayalam Theatre Artist and Actress Arrested in Drug Case in Kochi - Sakshi

నార్త్‌ నుంచి సౌత్‌ వరకు సినీ పరిశ్రమలో డ్రగ్స్‌  వ్యవహరం కలకలం సృష్టిస్తోంది. గతేడాది బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు అర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ కేసు కలకలం రేపింది. దక్షిణాదికి చెందిన ఓ నటి డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంఘటన హట్‌టాపిక్‌గా నిలిచింది. మాలీవుడ్‌కు చెందిన ఓ నటిని తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చదవండి: అమ్మ ప్రెగ్నెంట్‌ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి

వివరాలు.. కేరళ రాష్ట్రం కొచ్చిలోని త్రిక్కక్కరాలోని ఉనిచిర థోపిల్ జంక్షన్‌లో ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నటి అంజుకృష్ణ కొంతకాలంగా అద్దెకు ఉంటుంది. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఆమె బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి తన అపార్ట్‌మెంట్‌లో నుంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిటీ పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో యోధవ్ స్క్వాడ్‌ బుధవారం(మార్చి 22న)నటి అంజు కృష్ణ ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆమె ఇంట్లో 56 గ్రాముల సింథటిక్ డ్రగ్స్‌ ఎండీఎంఏను గుర్తించి సీజ్‌ చేశారు.

చదవండి: రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు

ఇక పోలీసులు రావడంతో నటి స్నేహితుడితో పాటు కొందరు యువతియువకులు అక్కడిన నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనలో నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్టు చేసి డ్రగ్స్‌ ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె స్నేహితుడు షామీర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా థియేటర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న నటి అంజుకృష్ణకు మూడేళ్ల క్రితం కాసర్‌గోడ్‌కు చెందిన షామీర్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు దంపతులమని చెప్పి ఉనిచ్చిరలోని ఇంటిని నెల రోజుల క్రితం అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అవకాలులేకపోవడంతో బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి కొచ్చిలో విక్రయించడం ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement