అత్యుత్సాహంతో ఓ అభిమాని చేసిన పనికి హీరోయిన్ అతడి చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కేరళలోని ఓ మాల్‌లో జరిగిన మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ప్రముఖ మలయాళ హీరోయిన్స్ సానియా అయ్యప్పన్, గ్రేస్ ఆంటోనిలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సాటర్‌డే నైట్. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కేరళలోని ఓ మాల్లో ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి అభిమానులు భారీగా తరలివచ్చారు.
చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార
ఈ కార్యక్రమం అనంతరం సానియా, గ్రేస్ ఆంటోనిలు మాల్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అభిమానులంత అత్యత్సాహంతో వారి వెంట కదిలారు. ఈ క్రమంలో కొందరు వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు ఏకంగా ఓ వ్యక్తి హీరోయిన్ గ్రేస్ ఒంటిపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహించిన సానియా అయ్యప్పన్ వెనక్కి తిరిగి అతడి చెంప చెళ్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంటికి వెళ్లిన సానియా సోషల్ మీడియా వేదికగా ఈ సంఘటనపై స్పందించింది. ‘నేను, మూవీ యూనిట్ కలిసి మా తాజా చిత్రం సాటర్‌డే నైట్ ప్రమోషన్స్ నేపథ్యంలో కాళికట్‌లోని మాల్‌కు వెళ్లాం. అక్కడికి వచ్చి మాపై చూపించిన మీ అభిమానానికి ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
చదవండి: హీరో విశాల్ ఇంటిపై దాడి కలకలం, ధ్వంసమైన కిటికి అద్దాలు
అలాగే ‘ఈ సందర్భంగా మాల్ అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. దీంతో వారందరిని అదుపు చేసేందుకు బాడిగార్డ్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్ ముగిసన అనంతరం నేను, నా కోస్టార్ గ్రేస్ బయటకు వస్తున్న క్రమంలో కొందరు మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు ఓ వ్యక్తి నా కోస్టార్‌పై చేయి వేశాడు. అయితే ఆ రద్దిలో ఏం జరుగుతుంది, పరిస్థితిని కంట్రోల్ చేసే పరిస్థితి ఆమె చేతిలో లేదు. అందువల్లే నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఏ అమ్మాయి ఎదురుకావద్దని కోరుకుంటున్నా. మహిళలకు వ్యతిరేకంగా అసభ్యంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా సానియా అయ్యప్పన్ మోహన్ లాల్ లూసిఫర్‌లో ఓ కి రోల్ పోషించింది.
#Malayalam actresses #SaniyaIyappan, #GraceAntony sexually #harassed during #filmpromotions
— Free Press Journal (@fpjindia) September 28, 2022
The incident took place when the two #actresses were promoting their upcoming film '#SaturdayNight' at the Hilite mall in #Kozhikode.https://t.co/OO6SgSmlK5#MalayalamActress #Shocking pic.twitter.com/OvBFiAsuz5
Comments
Please login to add a commentAdd a comment