తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా కథానాయికలుగా కనిపిస్తారు.
చదవండి: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి
‘‘మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టోవినో థామస్ మూడు పాత్రల్లో కనిపిస్తారు. మణియన్, అజయన్, కుంజికే పాత్రలు పోషిస్తున్నారాయన. కథ రీత్యా కేరళలోని కలరి మార్షల్ ఆర్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీంతో కలరి విద్యలో టోవినో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం జరిగింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment