సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటి, యాంకర్ సుబి సురేశ్(41) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవల ఆస్పత్రి చేరారు. చికత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి బుధవారం(ఫిబ్రవరి 22) ఉదయం తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే సుబి సురేశ్ మృతి చెందడంతో మాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది.
ఆమె మృతిపై మలయాళ సినీ ప్రముఖులు, సహా నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా యాంకర్‌గా, నటిగా సుబి సురేశ్‌కు మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. యాంకర్‌గా పలు టీవీ షోలతో అలరించిన ఆమె గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మా ఎన్న ఆన్ కుట్టీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.
Cinema Serial artist #SubiSuresh passed away..!!
— Arjun 🪓 (@ArjunVcOnline) February 22, 2023
Was in treatment for disease related to liver.
Shocking...!!!!
RIP 🙏🏻 pic.twitter.com/jq4gSPbz7X
చదవండి:
విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ
నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
Comments
Please login to add a commentAdd a comment