అగర్తలా: మహాభారతం సమయంలోనే ఇంటర్నెట్, ఉపగ్రహ సమాచార వ్యవస్థ ఉందన్న త్రిపుర ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర గవర్నర్ తథాగత్ రాయ్ మద్దతు లభించింది. పురాణ కాలం నాటి విషయాలపై ముఖ్యమంత్రి సమయోచితంగా మాట్లాడారన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా దివ్య దృష్టి, పుష్పక రథం వంటివి సాధ్యం కావని ట్వీటర్‌లో తెలిపారు. మహాభారతం కాలం, ఆ తర్వాత ప్రస్తుతం సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వినియోగంలో ఉండగా మధ్యయుగాల్లో ఏమైందో మాత్రం తనకు తెలియదన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment