
‘‘ఎందుకీ వేదాంతం... ఏంటా వైరాగ్యం?’’ అంటూ మంగళవారం సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ గురించి నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్చకు కారణం మహాభారతంలోని సమంత షేర్ చేసిన శ్లోకం.
‘కర్మణ్యే వాధికారస్తే.. మా ఫలేషు కదాచన..
మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోత్స్వ కర్మణి’
అనే శ్లోకంతో పాటు కారులో కూర్చుని ఎటో చూస్తున్న ఫొటోను షేర్ చేశారు సమంత. ‘కర్మ చేయడానికి మాత్రమే గానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు.. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు.. అలాగని ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానకు. ఏది ఏమైనా ముందుకు సాగిపో’ అనేది ఈ గీతాశ్లోకానికి అర్థం. సమంత ఈ శ్లోకం పెట్టడానికి కారణం ‘శాకుంతలం’ అని నెటిజన్లు అభి్రపాయపడుతున్నారు. ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించకపోవడంవల్లే ‘ఫలితం మన చేతుల్లో ఉండదు.. ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్లడమే’ అని చెప్పడానికి సమంత ఈ శ్లోకాన్ని షేర్ చేశారన్నది నెటిజన్ల ఊహ.
Comments
Please login to add a commentAdd a comment