slokam
-
ఫలితం మన చేతుల్లో ఉండదు
‘‘ఎందుకీ వేదాంతం... ఏంటా వైరాగ్యం?’’ అంటూ మంగళవారం సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ గురించి నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్చకు కారణం మహాభారతంలోని సమంత షేర్ చేసిన శ్లోకం. ‘కర్మణ్యే వాధికారస్తే.. మా ఫలేషు కదాచన.. మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోత్స్వ కర్మణి’ అనే శ్లోకంతో పాటు కారులో కూర్చుని ఎటో చూస్తున్న ఫొటోను షేర్ చేశారు సమంత. ‘కర్మ చేయడానికి మాత్రమే గానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు.. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు.. అలాగని ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానకు. ఏది ఏమైనా ముందుకు సాగిపో’ అనేది ఈ గీతాశ్లోకానికి అర్థం. సమంత ఈ శ్లోకం పెట్టడానికి కారణం ‘శాకుంతలం’ అని నెటిజన్లు అభి్రపాయపడుతున్నారు. ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించకపోవడంవల్లే ‘ఫలితం మన చేతుల్లో ఉండదు.. ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్లడమే’ అని చెప్పడానికి సమంత ఈ శ్లోకాన్ని షేర్ చేశారన్నది నెటిజన్ల ఊహ. -
‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్
మనం దెయ్యాలు గురించి ఎవరైనా చెబుతుంటే వారు చదువుకోలేదేమో! లేక వాళ్లు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని కొట్టిపారేస్తాం. పైగా మూర్ఖులుగా భావించి కాస్త చిన్నచూపు చూస్తాం. కానీ మంచి ఉన్నతోద్యోగంలో పనిచేస్తున్న వ్యక్తి దెయ్యాల గురించి చెబితే ఒకింత ఆశ్యర్యపోతూ వింటాం. పైగా ఎవరతను అని కచ్చితంగా కుతుహలంగా ఉంటుంది. అచ్చం అలానే ఒక ఐఐటీ ప్రొఫెసర్ దెయ్యాల గురించి కొన్ని ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయంలోకెళ్తే... ఐఐటి మండికి కొత్తగా నియమితులైన డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా దెయ్యాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. పైగా వాటిని తాను మంత్రాలు, శ్లోకాలు పఠించి దెయ్యాల్ని తరిమికొట్టానంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు దెయ్యాలు గురించి చెబుతూ..1993 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో చెన్నైలోని తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టాత్మలు ఏడిపించాయని చెప్పాడు. పైగా తాను అప్పుడు తన స్నేహితుడికి ఇంటికి వెళ్లి 'హరే రామ హరే కృష్ణ' మంత్రాన్ని పఠించడంతో పాటు "భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ దెయ్యాలు తన స్నేహితుడి భార్యని, అతని తండ్రిని పట్టుకున్నాయని, వారు చాలా వింతగా ప్రవర్తించడం కూడా చూశానని చెప్పాడు. ఇలా ఒక ఐఐటీ ప్రోఫెసర్ దెయ్యాలు గురించి ఆసక్తి కరంగా చెబుతున్నా వీడియో ఒకటి యూట్యూబ్లో "లెర్న్ గీత లైవ్ గీత" పేరుతో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఆసక్తికరమైన వీడియోగా వైరల్ అవుతోంది. అయితే బెహరా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్. పైగా అతను ఐఐటీ ఢిల్లీ నుండి పీహెచ్డీ కూడా చేయడమే కాక రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పేరుగాంచిన ప్రోఫెసర్ కావడం విశేషం. (చదవండి: కలలో కూడా ఊహించని గిఫ్ట్.. అవేమిటో తెలిస్తే షాక్..!) (చదవండి: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్ సంస్థలు కుదేలు) -
శ్లోకం... భావం
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః ముక్తా తా శుభదా భవంతు భవతామ్ శ్రీరామ వైవాహికాః ఈ శ్లోకం తెలియని తెలుగువారు అరుదు. పెళ్లిశుభలేఖలలో కొన్ని తరాలుగా పునర్ముద్రణ పొందుతూనే ఉంది ఈ శ్లోకం. ఇది చూడగానే సీతారాముల తలంబ్రాల ఘట్టం మనసులో మెదిలి ఆనందం, ఆహ్లాదం కలుగుతాయి. తాత్పర్యం: సీతారామకల్యాణంలో తలంబ్రాల ఘట్టం... జనక మహారాజు ముత్యాల తలంబ్రాలు తెప్పించాడు. సీతమ్మ మహదానందంతో రాముడి తలపైన తలంబ్రాలు పోస్తోంది. ఆ తెల్లని ముత్యాల తలంబ్రాలు... ఎర్ర తామరపువ్వులా వెలిగే సీతమ్మ దోసిట్లో ఉన్నప్పుడు పద్మరాగమణుల్లా కనిపించాయి. ఆమె వాటిని శ్రీరాముడి శిరస్సు మీద పోసినప్పుడు, ఆ నల్లని కేశాల మీద అవి తెల్లని మల్లెపూలల్లా ప్రకాశించాయి. తలమీది నుంచి కొంచెం జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద జాలువారినప్పుడు, ఆయన శరీరకాంతిలో అవి ఇంద్రనీలమణుల్లా భాసించాయి. అలాంటి ముత్యాల తలంబ్రాలు మీకందరకూ శుభం కలుగజేయుగాక! అంటున్నాడు కవి. రామకర్ణామృతమ్లో ఈ శ్లోకం కనిపిస్తుంది. - మల్లాది హనుమంతరావు