Madhu mantena
-
రీసెంట్గా పెళ్లి.. భార్య కోసం ప్రముఖ నిర్మాత షాకింగ్ డెసిషన్!
మూవీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్, పెళ్లి, విడాకులు లాంటివి చాలా కామన్. కలిసి నటించిన యాక్టర్స్ ప్రేమలో పడి ఓవైపు పెళ్లి చేసుకుంటే.. మరోవైపు కొందరు నిర్మాతలు లేటు వయసులోనూ రెండోసారి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉంటున్నాయి. తెలుగులో దిల్ రాజు ఇలానే రెండో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కూడా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ కి చెందిన మధు మంతెన.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగులో 'కార్తిక్' మూవీ తీశారు. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయారు. ఆమిర్ ఖాన్ 'గజిని', రక్త చరిత్ర, క్వీన్, మసాన్, సూపర్ 30 లాంటి హిట్ మూవీస్ కి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం 'రామాయణ్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తీసే బిజీలో ఉన్నారు. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్న మధు మంతెన.. 2019లో ఆమెకి విడాకులు ఇచ్చేశారు. రీసెంట్ గా యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మాల్దీవులకు ఈ జంట హనీమూన్ కు వెళ్లింది. భార్య ఫొటోల్ని కొన్ని ఈయన పోస్ట్ చేశారు. అయితే ఐరాని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంటిపేరుని తన ఇన్ స్టాలోనూ జోడించారు. ప్రస్తుతం 'మధు మంతెన త్రివేది' అని ఉంది. సాధారణంగా భర్తల పేరు లేదా ఇంటిపేరుని భార్య తన పేరు చివర చేర్చుకుంటుంది. ఇక్కడేమో రివర్స్ లో జరిగింది. (ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ) -
నిర్మాత పెళ్లిలో అల్లు అర్జున్ సందడి.. వెల్కమ్ చెప్పిన స్టార్ హీరోలు!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలో జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్ అగ్ర హీరోలు, పలువురు సినీతారలు హాజరయ్యారు. ముఖ్యంగా అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. జూన్ 11న కుటుంబసభ్యుల, అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట వివాహాబంధంలో ఒక్కటయ్యారు. ( ఇది చదవండి: రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి) అయితే పెళ్లి తర్వాత జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో ఐకాన్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న బన్నీ అమీర్ ఖాన్, అల్లు అర్జున్‌తో కరచాలనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బన్నీని చూసిన బాలీవుడ్ స్టార్స్ అప్యాయంగా పలకరించారు. ( ఇది చదవండి: తమన్నా ఏంటీ ఇలా?.. డబ్బుల కోసమే అలాంటి సీన్స్ చేస్తోందా?) View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) -
రెండో పెళ్లి చేసుకున్న గజిని చిత్ర నిర్మాత..!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, తన ప్రియురాలు ఐరా త్రివేదిని పెళ్లి చేసుకున్నారు. పలువురు బాలీవుడ్ తారలతో పాటు అమిర్ ఖాన్, హృతిక్ రోషన్ తదితరులు కూడా వివాహానికి హాజరయ్యారు. గతంలో మసాబా గుప్తాను పెళ్లాడిన మధు ఆమె విడాకులు తీసుకున్నారు. తాజాగా రెండో పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఐరా త్రివేది తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ( ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) ముంబయిలో జరిగిన ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. శనివారం జరిగిన మెహందీ వేడుకలో అమీర్, హృతిక్, రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ పాల్గొన్న సంగతి తెలిసిందే. మధు మంతెన గతంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. వీరు 2019లో విడిపోయారు. మసాబా ఇటీవలే సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. కాగా మధు మంతెన బాలీవుడ్లో క్వీన్, అగ్లీ, గజిని తదితర చిత్రాలను నిర్మించారు. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) View this post on Instagram A post shared by Ira Trivedi (@iratrivedi) -
బాలీవుడ్ నిర్మాత మధు మంతెనా-ఇరా త్రివేది మెహందీ వేడుక (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాత రెండో పెళ్లి.. మెహందీ వేడుకల్లో సినీ తారలు!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, ఐరా త్రివేది ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. ఇవాళ రాత్రి ముంబయిలో జరుగుతున్న మెహందీ వేడుకలో అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. నిర్మాత మధు మంతెన, రచయిత-యోగా శిక్షకురాలు ఇరా త్రివేదిని జూన్ 11న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ, నిఖిల్ ద్వివేది తళుక్కున మెరిశారు. ఈ పెళ్లివేడుక ఆదివారం ఓ ముంబయిలోని ఓ హోటల్లో జరగనుంది. (ఇది చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి తండ్రి ) ఈ జంట పెళ్లి తర్వాత త్వరలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మధు, ఐరా ఒకరికొకరు చాలా కాలంగా పరిచయమున్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహాబంధంతో ఒక్కటవుతున్నారు. మధు మంతెన ప్రస్తుతం రామాయణం చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. అంతకుముందు గజిని, అగ్లీ, క్వీన్ హిట్ చిత్రాలను మధు నిర్మించారు. నీనా గుప్తా కుమార్తెతో మసాబా గుప్తాతో విడాకులు కాగా.. 2015లో ఫ్యాషన్ డిజైనర్, బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురు మసాబా గుప్తాను మధు వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అయితే మసాబాను వివాహం చేసుకోక ముందే నందనా సేన్‌తో మధు రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే! ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇండస్ట్రీలో విషాదం.. ఆర్జీవీ మేనమామ మృతి
ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మధు మంతెన తండ్రి మురళీ రాజు అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతం రావడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా.. మధు మంతెన బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. కాగా.. మురళి రాజు.. దర్శకుడు రాంగోపాల్ వర్మకు మేనమామ. ఆయన మృతిపట్ల నిర్మాత అల్లు అరవింద్, నటులు అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్, బన్నీ వాసు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మురళి రాజు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన నిర్మించిన వాటిలో గజినీ, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, 83, రమన్ రాఘవ్ వంటి చిత్రాలున్నాయి. ఆర్జీవీ సహకారంతో మధు మంతెన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, విక్రమాదిత్య మోత్వానీతో కలిసి ఫాంటమ్ ఫిల్మ్స్ స్థాపించారు. మురళి రాజు కూడా గతంలో సినీ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు మధు మంతెన ప్రస్తుతం అల్లు అరవింద్‌తో కలిసి మూడు భాగాలుగా 3డిలో రామాయణం సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన మాటలు, స్క్రీన్ ప్లే పూర్తి చేశారు. -
ద్రౌపది, సీత పాత్రల్లో అలరించనున్న దీపికా పదుకోన్!
అనుకున్నట్లు అన్నీ కుదిరితే దీపికా పదుకోన్‌ని ప్రేక్షకులు సీత, ద్రౌపది పాత్రల్లో చూసే అవకాశం ఉంది. ఇప్పటికి ద్రౌపది పాత్ర ఖరారైంది. సీత పాత్ర ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు పాత్రలూ దీపికా చేస్తే.. రెండు పౌరాణిక పాత్రల్లో నటించిన ఘనత దీపికాకే దక్కుతుంది. ఇక విషయంలోకి వస్తే.. దీపికా పదుకోన్ కథానాయికగా రెండేళ్ల క్రితం ‘మహాభారత’ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. రెండేళ్లయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో ‘మహాభారత’ ఆగిందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వార్తలకు చిత్రనిర్మాత మధు మంతెన ఫుల్స్టాప్ పెట్టారు. ‘‘దీపికాకు ఈ కథ నచ్చి, నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాలనుకున్నారు. ద్రౌపది దృష్టి కోణం నుంచి మహాభారతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పురాణాలు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా పరిశోధనలు చేసి, సమాచారం సేకరించాం. ఇప్పుడు స్క్రీన్‌ప్లేకి కావాల్సిన సమాచారం మా దగ్గర ఉంది. అయితే ఈ సినిమాకి టైమ్ పడుతుంది. ఈలోపు ‘రామాయణ’ మొదలుపెడతాం. అయితే ఇంకా నటీనటులను అనుకోలేదు. రానున్న దీపావళికి ‘రామాయణ’ నటీనటులను ప్రకటించాలనుకుంటున్నాం’’ అన్నారు. అయితే ‘రామాయణ’లో సీత పాత్రను దీపికా చేయనున్నారనే వార్త ఉంది. అలాగే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘సీత: ది ఇన్కార్నేషన్’ కథ రాస్తున్నారు. ఈ సినిమాలో సీతగా దీపికా నటిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదాంట్లో అయినా సీతగా ఆమె నటిస్తే.. అటు ద్రౌపదిగానూ ఇటు సీతగానూ నటించిన ఘనత దీపికాకు దక్కుతుంది. -
తాప్సీ, అనురాగ్ కశ్యప్‌పై ఐటీ గురి
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ నివాసాల్లో బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కశ్యప్ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్ పాంథమ్ ఫిల్మ్ భాగస్వాములుగా ఉన్న వారందరిపైనా ఆదాయ పన్ను శాఖ దాడులకు దిగింది. అనురాగ్ కశ్యప్ మరికొందరితో కలిసి పాంథమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొన్ని చిత్రాలను నిర్మించారు. 2018లో ఈ ప్రొడక్షన్ కంపెనీని మూసేశారు. ఈ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న దర్శక నిర్మాత విక్రమాదిత్య, నిర్మాత వికాస్ బహల్, నిర్మాత పంపిణీదారుడు మధుమంతేనాలపై దాడులు చేశారు. ఏకకాలంలో ముంబై, పుణేలోని 30 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కంపెనీకి సహ ప్రచారకుడిగా వ్యవహరించినందుకే మధు మంతేనా నివాసంలో సోదాలు నిర్వహించినట్టుగా ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పినందుకేనా ..? ఇటీవల కాలంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తాప్సీ పలు ట్వీట్లు చేశారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తిపోయినప్పుడు కశ్యప్ జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లను సందర్శించి తన సంఘీభావం ప్రకటించారు. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేయడానికే ఈ సోదాలు జరిపారని మహారాష్ట్ర మంత్రులు ఆరోపణలు గుప్పించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ శాఖ వంటివన్నీ ప్రభుత్వ వ్యతిరేకుల్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తూ ఉంటాయని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. నిజాలు మాట్లాడే వారిపై ఒత్తిడిని పెంచి వారిని మాట్లాడనివ్వకుండా కేంద్రసర్కార్ చేస్తోందని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఆరోపించారు. -
రాముడిగా మహేశ్.. రావణుడి పాత్రలో హృతిక్..?
మహేశ్‌బాబు అభిమానులకు ఓ త్రిబుల్ ధమాకా వార్త. ఆ విశేషాలేంటంటే... రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ సినిమా కథాంశం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండనుందట. ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరణ జరిపే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను లాక్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు. రాముడిగా మహేశ్? రామాయణ ఇతివృత్తం ఆధారంగా హిందీలో భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్, మధు మంతెన ఓ సినిమా నిర్మించనున్నారు. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో మహేశ్ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రావణుడి పాత్రలో హిందీ నటుడు హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోన్ కనిపిస్తారట. మూడు భాగాలుగా ఈ సినిమాను సుమారు 1500 వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఎప్పటికీ ఇలానే ఉందాం మహేశ్ బాబు, నమ్రతకు పెళ్లయి బుధవారానికి 16 సంవత్సరాలు నిండాయి. 2005, ఫిబ్రవరి 10న ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 16వ వెడ్డింగ్ యానివర్సరీను దుబాయ్‌లో జరుపుకుంది ఈ జంట. ‘‘హ్యాపీ 16 నమ్రత. ఎప్పటికీ ఇలానే ఉందాం’’ అంటూ ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు మహేశ్. ‘‘ప్రేమ, నమ్మకం, విశ్వాసం– ఈ మూడూ మా అద్భుతమైన ప్రయాణానికి రెసిపీ’’ అన్నారు నమ్రత. -
ఈ సారి క్రిష్‌గా కాదు కృష్ణుడిగా?
అన్నీ కుదిరితే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కృష్ణావతారం ఎత్తనున్నారు. ఇప్పటివరకు క్రిష్‌గా అభిమానులను అలరించిన హృతిక్ ఈసారి కృష్ణుడిగా అందరి మనసులను దొంగలించే అవకాశం ఉంది. మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న చిత్రం ‘మహాభారతం’.. అయితే భారీ కాస్టింగ్‌తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు మధు మంతెన. దీనిలో భాగంగా ద్రౌపది పాత్రను దీపికా పడుకోన్ పోషించనున్నారు. అయితే మహాభారతంలో అతిముఖ్యమైన కృష్ణుడి పాత్ర కోసం పలువురు బాలీవుడ్ ఆగ్రహీరోలతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా హృతిక్ రోషన్‌తో ఫిల్మ్ మేకర్ మధు మంతెన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కృష్ణుడి లాంటి చాలెంజింగ్ పాత్రలో నటించేందకు హృతిక్ అంగీకరించినట్లు బాలీవుడ్ టౌన్లో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే గతంలో కృష్ణుడి పాత్రను అక్షయ్ కుమార్ లేక అమీర్ ఖాన్లు పోషించే అవకాశం ఉందని అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హృతిక్ పేరు తెరపైకి రావడంతో కృష్ణుడు ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. (చదవండి: ఆయనతో లిప్‌లాక్ అంటే ఓకే!) ఇక ద్రౌపది పాత్ర దీపిక పోషించనుండటంపై ఫిల్మ్‌మేకర్ మధు ఆనందం వ్యక్తం చేశారు. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు చూశాక రాణి పాత్ర అంటే దీపికనే చేయాలనే భావన కలిగిందన్నారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాల్లో దీపిక రాణి పాత్రలో జీవించేశారని, అప్పటికాలంలో రాణులంటే ఇలాగే ఉండేవారేమో అనిపించేంతగా ఆ పాత్రలను పోషించారని ప్రశంసల వర్షం కురిపించారు. ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా రూపొందడం విలక్షణమని చెప్పారు. దీపికా చిత్ర బృందంలో చేరడంతోనే ఈ మూవీని భారీస్ధాయిలో రూపొందుతోందని.. ఆమె భారత్‌లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని అన్నారు. తెలుగు, హిందీ సహా భిన్న భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ పలు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి దీపిక సహ నిర్మాత వ్యవహరించనున్న విషయం తెలిసిందే. -
ద్రౌపదిగా దీపిక
‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నారు. ఈ సినిమాను మధు మంతెన, దీపికా పదుకోన్ నిర్మించనున్నారు. రెండు మూడు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తొలి పార్ట్‌ను 2021 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీపిక. ‘‘ద్రౌపది పాత్రలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నా జీవితాంతం గుర్తిండిపోయేలా ద్రౌపది పాత్ర వెండితెరపైకి వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు దీపిక. ‘‘మహాభారతం గురించి, ఈ గ్రంథం ద్వారా వచ్చిన సినిమాల గురించి మనందరికీ తెలుసు. కానీ మా సినిమా ద్రౌపది దృష్టి కోణంలో సాగుతుంది. కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయాన్ని, ఇతర నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు మధు మంతెన. -
విడాకుల విషయం విని షాక్ అయ్యా!
తమ కూతురి విడాకుల విషయం విని షాక్‌కు గురయ్యామని బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా అన్నారు. నీనా గుప్తా ఇటీవలే బదాయి హో చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా ఫిల్మ్ ఫేర్ (క్రిటిక్స్) బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురి విడాకులకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే తమకు ఈ విషయం తెలిసిందని అన్నారు. తన కూతురు మసాబా గుప్తా, అల్లుడు మధు మంతెన మార్చిలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే.. మధు ఎంతో మంచి వాడని, ఇప్పటికీ తమకు అతనంటే ఎంతో ఇష్టమని, ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని తన కూతురితో చెప్పినట్లు వివరించారు. వాళ్లిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమేనని, బాగా ఆలోచించుకునే విడాకులు కోరుకుంటున్నారని అన్నారు. నీనా గుప్తా తాజాగా ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌లో నటించారు. కంగనా రనౌత్ ‘పంగా’లో కూడా నటించనున్నారు. -
వర్మ కొత్త కంపెనీ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంఛలనానికి తెర తీశాడు. ఇప్పటికే రక్తచరిత్ర, వీరప్పన్, వంగవీటి లాంటి చిత్రాలను తెరకెక్కించిన వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. త్వరలో వర్మ బ్యానర్లో డి-కంపెనీ పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నారు. 1980లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహిం కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నాడు వర్మ. ఇప్పటికే సినిమా కోసం రిసెర్చ్ ప్రారంభించిన వర్మ 20 క్రితం జరిగిన సంఘటనల గురించి సమాచారాన్ని సేకరించారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని సినిమాగా కన్నా వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తేనే సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు వర్మ. ఈ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వర్మ. అయితే వెబ్ సిరీస్ ఏ ఏ భాషల్లో రూపొందిస్తున్నారు. ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయాలను మాత్రం వర్మ వెల్లడించలేదు. Me and Madhu Mantena team up for a web series D COMPANY, a chronicle of the Mumbai underworld ..Starting from rise of Dawood Ibrahim in early 80’s and initiation of D Company,story will be till end of the tremendous gang wars that started post 93 blastshttps://t.co/TXbIIof8Zz — Ram Gopal Varma (@RGVzoomin) 26 July 2018 -
రిచర్డ్స్ ప్రామిస్!
ఎంగేజ్మెంట్కు నాన్న రాలేదని అలిగిన మసబా గుప్తాకు పెద్ద ఊరటే లభించింది. నవంబర్‌లో జరిగే పెళ్లికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చి కుమార్తె మోములో వెలుగులు పూయించాడు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్, మసాబా తండ్రి వివియన్ రిచర్డ్స్! వెటరన్ నటి నీనాగుప్తా, రిచర్డ్స్‌ల కూతురైన మసాబా ఫ్యాషన్ డిజైనర్. ఫిల్మ్ ప్రొడ్యూసర్ మధు మంతెనతో ముంబైలో రీసెంట్గా ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా, హ్యుమా ఖురేషి తదితర బాలీవుడ్ ప్రముఖులు, క్లోజ్ ఫ్రెండ్స్ ఈ అకేషన్‌కు అటెండయ్యారు. రిచర్డ్స్ మాత్రం మిస్సయ్యాడు. అయితే రిచర్డ్స్, ఆయన సతీమణి మిరియమ్ స్పీచ్‌తో ప్రదర్శించిన ఏవీ ఫంక్షన్లో ఉన్నవారందర్నీ టచ్ చేసింది. మసాబాను తొలిసారి కలిసి హగ్ చేసుకున్న మిరియమ్... ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది. ఆమె తనకు మంచి ఫ్రెండని చెప్పింది. పెళ్లి తరువాత కుమార్తె అత్తింటికి వెళ్లిపోతే తాను ఒంటరినైపోతానంటూ నీనాగుప్తా కంటతడి పెట్టుకుంది. భర్తను రిటైర్మెంట్ తీసుకుని తనకు తోడుగా ఇంట్లోనే ఉండమని కోరిందట! మొత్తానికి మసాబా ఎంగేజ్మెంట్ పక్కా సెంటిమెంట్ సినిమాలా మారి... అతిథుల హృదయాలను ద్రవింపజేసింది!