![Producer Madhu Mantena father Murali Raju passed away in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/7/WhatsApp%20Image%202023-03-07%20at%2016.46.40%281%29.jpeg.webp?itok=95h4W8xx)
మధు మంతెన
ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మధు మంతెన తండ్రి మురళీ రాజు అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతం రావడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా.. మధు మంతెన బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. కాగా.. మురళి రాజు.. దర్శకుడు రాంగోపాల్ వర్మకు మేనమామ. ఆయన మృతిపట్ల నిర్మాత అల్లు అరవింద్, నటులు అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్, బన్నీ వాసు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మురళి రాజు పార్థివదేహానికి నివాళులర్పించారు.
ఆయన నిర్మించిన వాటిలో గజినీ, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, 83, రమన్ రాఘవ్ వంటి చిత్రాలున్నాయి. ఆర్జీవీ సహకారంతో మధు మంతెన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, విక్రమాదిత్య మోత్వానీతో కలిసి ఫాంటమ్ ఫిల్మ్స్ స్థాపించారు. మురళి రాజు కూడా గతంలో సినీ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు
మధు మంతెన ప్రస్తుతం అల్లు అరవింద్‌తో కలిసి మూడు భాగాలుగా 3డిలో రామాయణం సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన మాటలు, స్క్రీన్ ప్లే పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment