Producer Madhu Mantena Changes His Name On Instagram - Sakshi
Sakshi News home page

Madhu Mantena: భార్యపై ఇష్టంతో స్టార్ ప్రొడ్యూసర్ అలా!

Published Fri, Jun 16 2023 4:47 PM | Last Updated on Fri, Jun 16 2023 5:16 PM

Madhu Mantena Change His Name Ira Trivedi - Sakshi

మూవీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్, పెళ్లి, విడాకులు లాంటివి చాలా కామన్. కలిసి నటించిన యాక్టర్స్ ప్రేమలో పడి ఓవైపు పెళ్లి చేసుకుంటే.. మరోవైపు కొందరు నిర్మాతలు లేటు వయసులోనూ రెండోసారి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉంటున్నాయి. తెలుగులో దిల్ రాజు ఇలానే రెండో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కూడా మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

హైదరాబాద్ కి చెందిన మధు మంతెన.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగులో 'కార్తిక్' మూవీ తీశారు. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయారు. ఆమిర్ ఖాన్ 'గజిని', రక్త చరిత్ర, క్వీన్, మసాన్, సూపర్ 30 లాంటి హిట్ మూవీస్ కి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం 'రామాయణ్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తీసే బిజీలో ఉన్నారు.

2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్న మధు మంతెన.. 2019లో ఆమెకి విడాకులు ఇచ్చేశారు. రీసెంట్ గా యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మాల్దీవులకు ఈ జంట హనీమూన్ కు వెళ్లింది. భార్య ఫొటోల్ని కొన్ని ఈయన పోస్ట్ చేశారు. అయితే ఐరాని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంటిపేరుని తన ఇన్ స్టాలోనూ జోడించారు. ప్రస్తుతం 'మధు మంతెన త్రివేది' అని ఉంది. సాధారణంగా భర్తల పేరు లేదా ఇంటిపేరుని భార్య తన పేరు చివర చేర‍్చుకుంటుంది. ఇక్కడేమో రివర్స్ లో జరిగింది.

(ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement