Madhu Mantena And Ira Trivedi Marriage Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Madhu Mantena: యోగా శిక్షకురాలిని పెళ్లాడిన నిర్మాత.. ఫోటోలు వైరల్!

Published Sun, Jun 11 2023 9:22 PM | Last Updated on Mon, Jun 12 2023 12:14 PM

Madhu Mantena and Ira Trivedi are married See FIRST pics - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, తన ప్రియురాలు ఐరా త్రివేదిని పెళ్లి చేసుకున్నారు. పలువురు బాలీవుడ్ తారలతో పాటు అమిర్ ఖాన్, హృతిక్ రోషన్ తదితరులు కూడా వివాహానికి హాజరయ్యారు. గతంలో మసాబా గుప్తాను పెళ్లాడిన మధు ఆమె విడాకులు తీసుకున్నారు.  తాజాగా రెండో పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఐరా త్రివేది తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

( ఇది చదవండి: సుశాంత్‌ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!)

ముంబయిలో జరిగిన ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. శనివారం జరిగిన మెహందీ వేడుకలో అమీర్, హృతిక్, రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ పాల్గొన్న సంగతి తెలిసిందే. మధు మంతెన గతంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. వీరు 2019లో విడిపోయారు. మసాబా ఇటీవలే సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. కాగా మధు మంతెన బాలీవుడ్‌లో క్వీన్, అగ్లీ, గజిని తదితర చిత్రాలను నిర్మించారు. 

(ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement