వర్మ కొత్త కంపెనీ | Ram Gopal Varma New Web Series D Company | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 26 2018 2:43 PM | Last Updated on Thu, Jul 26 2018 4:58 PM

Ram Gopal Varma New Web Series D Company - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంఛలనానికి తెర తీశాడు. ఇప్పటికే రక్తచరిత్ర, వీరప్పన్‌, వంగవీటి లాంటి చిత్రాలను తెరకెక్కించిన వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. త్వరలో వర్మ బ్యానర్‌లో డి-కంపెనీ పేరుతో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించనున్నారు. 1980లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహిం కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నాడు వర్మ.

ఇప్పటికే సినిమా కోసం రిసెర్చ్‌ ప్రారంభించిన వర్మ 20 క్రితం జరిగిన సంఘటనల గురించి సమాచారాన్ని సేకరించారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని సినిమాగా కన్నా వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కిస్తేనే సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు వర్మ. ఈ వెబ్‌ సిరీస్‌ను బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వర్మ. అయితే వెబ్‌ సిరీస్‌ ఏ ఏ భాషల్లో రూపొందిస్తున్నారు. ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయాలను మాత్రం వర్మ వెల్లడించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement