d company
-
సామాన్యుడి ముసుగులో ఉగ్రదందా!
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు. వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. కరోనా లాక్డౌన్ సందర్భంగా భారత్‌కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్‌కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్‌కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు. కుట్రలో కీలకమైన మూల్‌చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్‌లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది. డీ కంపెనీతో లింకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు. దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్మచ్కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్‌గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్‌గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది. యూపీపై కన్ను యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది. ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్‌ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
సినిమాల శాంపిల్ రెడీ.. చూసేందుకు మీరు సిద్ధమా
కంప్యూటర్ వదలి నాగలి పట్టి, వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. చావు కబురు చల్లగా చెబుతాడు మరో యువకుడు. గ్రామంలో జరిగే ఊహించని పరిణామాలకు భయపడతారు గ్రామప్రజలు. ఒక గ్యాంగ్‌స్టర్ అండర్‌వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ నాలుగు కథలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈలోపు నాలుగు సినిమాలకు సంబంధించిన చిన్న శాంపిల్‌ని ట్రైలర్, టీజర్ రూపంలో చూపించాయి ఆయా నిర్మాణసంస్థలు. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, కార్తికేయ చేసిన ‘చావు కబురు చల్లగా..’, సముద్రఖని ‘ఆకాశవాణి’, రామ్‌గోపాల్‌వర్మ ‘డి కంపెనీ’ సినిమాలకు సంబంధించి కొత్త విశేషాలు బయటకొచ్చాయి. జోడీ కుదిరింది ‘‘రామ్‌తో కలిసి సినిమా చేయబోతున్నందుకు సూపర్ డూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేసినట్లు శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మట్టికి.. మనిషికి మధ్య ప్రేమకథ ఉద్యోగం చేస్తున్న కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కి మేనేజర్ కావాల్సిన యువకుడు వ్యవసాయం కోసం పొలంలో కాలు పెట్టాడు. నాగలి పట్టాడు. మట్టికి మనిషికి మధ్య ఉన్న ప్రేమకథను మరోసారి గుర్తు చేయడానికి శ్రీకారం చూట్టాడు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన¯Œ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వం వహించిన ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కిశోర్ దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. బస్తీ ప్రేమకథ అబ్బాయి శవాలబండి డ్రైవర్. అమ్మాయి నర్స్. అబ్బాయికి అమ్మాయిపై లవ్వు. కానీ అమ్మాయికి అబ్బాయంటే కోపం. మరి.. ప్రేమకథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నకు ‘చావు కబురు చల్లగా..’లో సమాధానం దొరుకుతుంది. కార్తికేయ, లావాణ్యా త్రిపాఠీ జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. కౌశిక్ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో బస్తీ బాలరాజుగా కార్తికేయ, మల్లిక పాత్రలో లావణ్యా త్రిపాఠీ నటించారు. గ్రామంలో అలజడి అడవికి దగ్గరగా ప్రశాంతంగా ఉన్న ఓ గ్రామంలో ఊహించని అలజడి రేగుతుంది. భయంతో గ్రామస్తులు రాత్రివేళ దేనికోసమో అన్వేషిస్తుంటారు. ఆ గ్రామంలో ఏం జరిగింది? అనే మిస్టరీ వీడాలంటే ‘ఆకాశవాణి’ చూడాల్సిందే. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో అశ్వి¯Œ గంగరాజు దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశవాణి’. దీని టీజర్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి– కంపెనీ’. అక్షత్ కాంత్, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్ర కాంత్ ప్రధాన పాత్రల్లో స్పార్క్ సాగర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘‘గ్యాంగ్‌స్టర్ స్థాయి నుంచి అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడు? 1993లో ముంబయ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారి ఎవరు? అనే అంశాలను ప్రస్తావించాం. ఈ 26న తెలుగు, హిందీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆర్జీవీ: డీ కంపెనీ ట్రైలర్ రిలీజ్..
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీసిన చిత్రమే డీ కంపెనీ. హిందీ ట్రైలర్‌ను బుధవారమే రిలీజ్ చేసిన ఆయన తాజాగా నేడు(శుక్రవారం) తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇందులో దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేది చూపించారు. మనం పైకి రావడానికి ఛాన్స్ ఉంది, రిస్క్ కూడా ఉంది అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. తుపాకీల మోత, కత్తులతో నరుక్కోవడాలు.. చూస్తుంటే రక్తపాతాలు, బీభత్సాలు, హింస విపరీతంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ కొన్నిచోట్ల పాత పద్ధతులనే రిపీట్ చేస్తూ రొటీన్ అనిపిస్తోంది. ఇందులో వర్మ మార్క్ పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. సాగర్ మాచనూరు నిర్మిస్తున్న ఈ సినిమాకు పౌల్ ప్రవీణ్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: వర్మ ‘డీ కంపెనీ’ టీజర్ గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా -
దావూద్ ‘షేర్’ దందా
న్యూఢిల్లీ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను ఎక్కడికక్కడ స్థంభింపచేస్తున్నా డ్రగ్స్ సహా అజ్ఞాత కార్యకలాపాల ద్వారా ఆర్జిస్తున్న మొత్తాన్ని ఆయన పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్)లో పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడైంది. పలు క్యాపిటల్ సెక్యూరిటీ సంస్థల ద్వారా దావూద్ ఇబ్రహీం తన రాబడులను పీఎస్ఎక్స్ పరిధిలోని మూడు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో మదుపు చేస్తున్నాడు. పీఎస్‌ఎక్స్‌లో దావూద్ తన అక్రమ నిధులను పెట్టుబడి పెట్టడం పట్ల భారత నిఘా సంస్ధలు కీలక ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధ లావాదేవీలు, నకిలీ భారత కరెన్సీ నోట్ల రాకెట్, దోపిడీ దందాల ద్వారా దావూద్ పెద్దమొత్తంలో డబ్బు కూడబెడుతున్నాడు. దావూద్ గ్యాంగ్ సభ్యుడు, ప్రస్తుతం లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్న జబీర్ మోతీకి చెందిన ఐదు క్యాపిటల్ సెక్యూరిటీ కంపెనీలు ప్రస్తుతం పీఎస్ఎక్స్ పరిధిలో ఉండగా, వీటి ద్వారా దావూద్ తన పెట్టుబడులను షేర్ మార్కెట్లోకి మళ్లించినట్టు చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని ప్రముఖ షేర్ బ్రోకింగ్ కంపెనీ హబీబ్ బ్యాంక్ సబ్సిడరీ హబీబ్ మెట్రపాలిటన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా పలు షెల్ కంపెనీల పేరుతో దావూద్ గ్యాంగ్ షేర్ మార్కెట్లోకి నిధులను మళ్లించింది. హబీబ్ బ్యాంక్ ఉన్నతాధికారులను దావూద్‌కు పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్, దావూద్ కుమార్తె మెహ్రీన్ మామ పరిచయం చేసినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హబీబ్ బ్యాంక్‌పై మనీ ల్యాండరింగ్ సహా ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తుందని 2017లో అమెరికా ఆర్థిక సేవల శాఖ ఆరోపించడం గమనార్హం. -
భారత్‌కు దావూద్ కీలక అనుచరుడు!
న్యూఢిల్లీ: డీ-కంపెనీ ప్రధాన హవాలా నిర్వాహకుడు అహ్మద్ రజా అలియాస్ అఫ్రోజ్ వడారియాను భారతదేశానికి తీసుకురావడంలో ముంబై పోలీసులు, భారత ప్రభుత్వం గొప్ప పురోగతిని సాధించాయి. చోటా షకీల్, ఫహీమ్ మక్మాచ్లకు సన్నిహితుడైన రజా సూరత్, ముంబై, థానేలలో డీ-కంపెనీ వ్యాపారాలని నిర్వహిస్తున్నాడు. రజా సూరత్‌లో వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ముంబై పోలీసు బృందం గత సంవత్సర కాలం నుంచి రజాను ట్రాక్ చేస్తోంది. అతనిపై లుక్ అవుట్ నోటీస్‌లను కూడా జారీ చేసింది. అహ్మద్ రజాను అనూహ్యంగా గత నెలలో దుబాయ్‌లో అదుపులోకి తీసుకొని, భారత్‌కు తరలించే ప్రక్రియను భారత ఏజెన్సీలు ప్రారంభించాయి. ముంబై, థానే మరియు సూరత్‌లలో అతని సహాయకులను గుర్తించడానికి క్రైమ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటుచేసి విచారణను ముమ్మరం చేసింది. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన నేపథ్యంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని డి-కంపెనీపైనా చర్యలు తీసుకోవాలని భారతదేశం ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను కోరుతోంది. దావూద్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో కలిసి పనిచేస్తున్నాడు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నిర్వహించడమే కాకుండా దేశంలోకి నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ల ద్వారా డీ-కంపెనీ నకిలీ కరెన్సీ నోట్లను అక్రమంగా రవాణా చేస్తుంది. భారతదేశానికి నకిలీ నోట్లను తరలించడానికి, డి-కంపెనీ కార్యకలాపాలకు నేపాల్ ఒక రవాణా కేంద్రంగా పనిచేస్తోంది. డి-కంపెనీకి ముఖ్య సహాయకుడు జబీర్ మోతీవాలాను అమెరికాకు అప్పగించకుండా ఉండటానికి పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలపై మోతీవాలాను లండన్‌లో 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. చేశారు. మోతీవాలాను అమెరికాకు తరలిస్తే, దావూద్ ఇబ్రహీంకు ఐఎస్ఐతో ఉన్న సంబంధాన్ని అతను బహిర్గతం చేస్తాడని పాకిస్తాన్ భయపడుతోంది. మిలియన్ డాలర్ల అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ నడుపుతున్న ప్రపంచ ఉగ్రవాదిగా దావూద్ ఇబ్రహీంను అమెరికా ఇప్పటికే ప్రకటించింది. -
వర్మ కొత్త కంపెనీ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంఛలనానికి తెర తీశాడు. ఇప్పటికే రక్తచరిత్ర, వీరప్పన్, వంగవీటి లాంటి చిత్రాలను తెరకెక్కించిన వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. త్వరలో వర్మ బ్యానర్లో డి-కంపెనీ పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నారు. 1980లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహిం కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నాడు వర్మ. ఇప్పటికే సినిమా కోసం రిసెర్చ్ ప్రారంభించిన వర్మ 20 క్రితం జరిగిన సంఘటనల గురించి సమాచారాన్ని సేకరించారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని సినిమాగా కన్నా వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తేనే సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు వర్మ. ఈ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వర్మ. అయితే వెబ్ సిరీస్ ఏ ఏ భాషల్లో రూపొందిస్తున్నారు. ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయాలను మాత్రం వర్మ వెల్లడించలేదు. Me and Madhu Mantena team up for a web series D COMPANY, a chronicle of the Mumbai underworld ..Starting from rise of Dawood Ibrahim in early 80’s and initiation of D Company,story will be till end of the tremendous gang wars that started post 93 blastshttps://t.co/TXbIIof8Zz — Ram Gopal Varma (@RGVzoomin) 26 July 2018 -
డీ కంపెనీ దూకుడు..
వాషింగ్టన్ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ మెక్సికన్ డ్రగ్ కంపెనీల తరహాలో పలు అక్రమ వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది. భారత మూలాలు కలిగిన పాక్‌కు చెందిన క్రైమ్ టెర్రర్ గ్రూప్ డీ కంపెనీ మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు భారీ నేర సామ్రాజ్యాన్ని ఇతర రంగాలకూ విస్తరిస్తోందని జార్జ్ మాసన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ లూసీ షెల్లీ అమెరికన్ సెనేటర్లకు వివరించారు. డీ కంపెనీ ఆయుధాల రవాణాతో పాటు నకిలీ డీవీడీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా ఆర్థిక సేవల కార్యకలాపాల వంటి పలు రంగాల్లోకి చొచ్చుకువచ్చిందని ఉగ్రవాదం అక్రమ నిధులపై సెనేట్ సబ్‌కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు ఆయన వెల్లడించారు. పరారీలో ఉన్న భారత అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో డీ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. పలు తీవ్ర నేరాలు, ముంబయి ఉగ్రదాడులతో ప్రమేయం ఉన్న దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నాడని భారత్, అమెరికా చెబుతుండగా, తమ దేశంలో లేడని పాక్ అధికారులు నిరాకరిస్తున్నారు. -
ఆఖరి శ్వాస వరకూ దావూద్‌తోనే!
ముంబై : డీ గ్యాంగ్‌లో విభేధాలు వచ్చాయన్న వార్తలపై ఛోటాషకీల్ తాజాగా స్పందించారు. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎటువంటి విభేధాలు లేవని.. ఆఖరి శ్వాస వరకూ అతనితో ఉంటానని ఛోటా షకీల్ స్పష్టం చేశారు. అండర్ వరల్డ్‌లో డీ కంపెనీ కోసమే పనిచేస్తానని ఛోటా షకీల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీంతో వచ్చిన విభేధాల వల్ల ఛోటా షకీల్ వేరు కుంపటి పెట్టుకున్నట్లు వచ్చిన నిఘా సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దావూద్ గొడవలు వచ్చాయనడం కేవలం పుకార్లు మాత్రమేనని ఛోటా షకీల్ అన్నారు. తన చివరి శ్వాస వరకూ డీ కంపెనీకే పనిచేస్తానని ఛోటా షకీల్ తాజాగా పేర్కొన్నారు. ఒక గుర్తుతెలియన ప్రాంతం నుంచి ఛోటా షకీల్ జీ న్యూస్‌కు ఈ విషయాన్ని తెలిపారు. అదే సమయంలో ‘నేను భాయ్‌తో ఎప్పటిలాగే ఉన్నా. ఇకముందు ఉంటాను’ అని తెలిపారు. డీ గ్యాంగ్‌లో దావూద్‌కు ఛోటా షకీల్‌ను కుడి భుజంగా వ్యవహరిస్తారు. డీ గ్యాంగ్‌లో దావూద్ సోదరుడు అనీస్ పాత్ర పెరగడంతో.. షోటా షకీల్ దావూద్‌కు దూరమయినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో దావూద్‌ను, ఛోటా షకీల్‌ను కలిపేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని తెలిస్తోంది. -
డీ గ్యాంగ్ కోడ్స్ ఇవే...
సాక్షి, న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోడ్ పదాల గురించి పోలీసులు అదుపులోకి తీసుకున్న గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ కస్కర్ పలు వివరాలు వెల్లడించాడు. నేర కార్యకలాపాలను చేపట్టే క్రమంలో దావూద్ నడిపే డీ కంపెనీ వాడే కోడ్ పదాలను ఇక్బాల్ వివరించాడు. వీరు మోదీ, ఢిల్లీ పదాలను చోటా షకీల్, కరాచీలకు కోడ్ పదాలుగా వాడతారని వెల్లడించాడు.ఇక దావూద్ ఇబ్రహీంను డీ గ్యాంగ్ బడే అనే కోడ్‌తో పిలుస్తుంది. పోలీస్ వాహనాన్ని డబ్బాగా వ్యవహరిస్తారు. రూ లక్షను ఏక్ డబ్బాగా పేర్కొంటారు. రూ కోటికి ఏక్ బాక్స్ కోడ్ వాడతారని కస్కర్ పోలీసులతో పేర్కొన్నట్టు సమాచారం. తమ ఆపరేటర్లతో మాట్లాడే సందర్భంలో దావూద్ గ్యాంగ్ ఈ కోడ్ పదాలను ప్రయోగిస్తుంది. ఈ వివరాలతో పాటు తన సోదరులు దావూద్, అనీస్ ఇబ్రహీంలు పాకిస్తాన్లో ఉన్నారని కస్కర్ నిర్ధారించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తప్పించుకునేందుకు వారు ఎలాంటి పత్రాలు లేకుండా దుబాయ్ వెళుతుంటారని పేర్కొన్నట్టు సమాచారం. -
రాజన్‌ను త్వరలోనే లేపేస్తాం
మాఫియా డాన్, దావూద్ ఇబ్రహీం కుడి భుజం లాంటి ఛోటా షకీల్ నోరు విప్పాడు. త్వరలోనే తాము ఛోటా రాజన్‌ను లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. పాతికేళ్లుగా తమ డి కంపెనీకి ఛోటా రాజన్‌తో శత్రుత్వం ఎందుకు ఉందో కూడా తెలిపాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల నిందితుల్లో ఆరుగురిని ఛోటా రాజన్ గ్యాంగు చంపేసింది. 1998-2001 మధ్య ఈ హత్యలు జరిగాయి. దాన్ని తాము ఈరోజు వరకు జీర్ణించుకోలేకపోతున్నట్లు షకీల్ చెప్పాడు. బాలిలో రాజన్ అరెస్టు అయినప్పటి నుంచి మళ్లీ రెండు దశాబ్దాల నాటి పాత పగలను గుర్తుకు తెచ్చుకున్నామన్నాడు. అప్పట్లో రాజన్ గ్యాంగు హతమార్చినవాళ్లలో యాకూబ్ యేడా సోదరుడు మజీద్ ఖాన్ ఒకడు. అతడు దావూద్ ఇబ్రహీంతో పాటు ఛోటా షకీల్‌కు కూడా బాగా సన్నిహితుడు. ఈ హత్యలో రాజన్‌కు పోలీసులు కూడా సహకరించారని షకీల్ అంటున్నాడు. ఇప్పటికే డి కంపెనీ కోర్టులో రాజన్‌కు మరణశిక్ష విధించామని, ఈ హత్యల కారణంగా త్వరలోనే రాజన్‌ను చంపడం ఖాయమని స్పష్టం చేశాడు. త్వరలోనే అవకాశం రావాలని అల్లాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. సీబీఐ వాళ్లు రాజన్‌ను ముంబై పోలీసులకు అప్పగించడానికి నిరాకరించడంపై కూడా ఛోటా షకీల్ వ్యాఖ్యానించాడు. ''రాజన్ ఏమైనా వాళ్లకు చుట్టమా.. అందుకే ముంబై పోలీసులకు అప్పగించలేదా? కేసులన్నీ ముంబైలోనే కదా ఉన్నవి.. ఆరుగురు నిర్దోషులను చంపేశాడు. ఆ కేసులు కూడా ముంబై పోలీసుల వద్దే ఉన్నాయి. ఈ హత్యల వల్లే అతడికి దేశభక్తుడన్న పేరు వచ్చేసింది'' అని ఛోటా షకీల్ అన్నాడు.