
న్యూఢిల్లీ: డీ-కంపెనీ ప్రధాన హవాలా నిర్వాహకుడు అహ్మద్ రజా అలియాస్ అఫ్రోజ్ వడారియాను భారతదేశానికి తీసుకురావడంలో ముంబై పోలీసులు, భారత ప్రభుత్వం గొప్ప పురోగతిని సాధించాయి. చోటా షకీల్, ఫహీమ్ మక్మాచ్‌లకు సన్నిహితుడైన రజా సూరత్, ముంబై, థానేలలో డీ-కంపెనీ వ్యాపారాలని నిర్వహిస్తున్నాడు. రజా సూరత్‌లో వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ముంబై పోలీసు బృందం గత సంవత్సర కాలం నుంచి రజాను ట్రాక్ చేస్తోంది. అతనిపై లుక్ అవుట్ నోటీస్‌లను కూడా జారీ చేసింది. అహ్మద్ రజాను అనూహ్యంగా గత నెలలో దుబాయ్‌లో అదుపులోకి తీసుకొని, భారత్‌కు తరలించే ప్రక్రియను భారత ఏజెన్సీలు ప్రారంభించాయి.
ముంబై, థానే మరియు సూరత్‌లలో అతని సహాయకులను గుర్తించడానికి క్రైమ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటుచేసి విచారణను ముమ్మరం చేసింది. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన నేపథ్యంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని డి-కంపెనీపైనా చర్యలు తీసుకోవాలని భారతదేశం ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను కోరుతోంది. దావూద్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో కలిసి పనిచేస్తున్నాడు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నిర్వహించడమే కాకుండా దేశంలోకి నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నాడని ఆరోపణలున్నాయి.
సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌ల ద్వారా డీ-కంపెనీ నకిలీ కరెన్సీ నోట్లను అక్రమంగా రవాణా చేస్తుంది. భారతదేశానికి నకిలీ నోట్లను తరలించడానికి, డి-కంపెనీ కార్యకలాపాలకు నేపాల్ ఒక రవాణా కేంద్రంగా పనిచేస్తోంది. డి-కంపెనీకి ముఖ్య సహాయకుడు జబీర్ మోతీవాలాను అమెరికాకు అప్పగించకుండా ఉండటానికి పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలపై మోతీవాలాను లండన్‌లో 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. చేశారు. మోతీవాలాను అమెరికాకు తరలిస్తే, దావూద్ ఇబ్రహీంకు ఐఎస్‌ఐతో ఉన్న సంబంధాన్ని అతను బహిర్గతం చేస్తాడని పాకిస్తాన్ భయపడుతోంది. మిలియన్ డాలర్ల అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ నడుపుతున్న ప్రపంచ ఉగ్రవాదిగా దావూద్ ఇబ్రహీంను అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment