ఫైల్‌ఫోటో
వాషింగ్టన్ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ మెక్సికన్ డ్రగ్ కంపెనీల తరహాలో పలు అక్రమ వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది. భారత మూలాలు కలిగిన పాక్‌కు చెందిన క్రైమ్ టెర్రర్ గ్రూప్ డీ కంపెనీ మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు భారీ నేర సామ్రాజ్యాన్ని ఇతర రంగాలకూ విస్తరిస్తోందని జార్జ్ మాసన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ లూసీ షెల్లీ అమెరికన్ సెనేటర్లకు వివరించారు.
డీ కంపెనీ ఆయుధాల రవాణాతో పాటు నకిలీ డీవీడీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా ఆర్థిక సేవల కార్యకలాపాల వంటి పలు రంగాల్లోకి చొచ్చుకువచ్చిందని ఉగ్రవాదం అక్రమ నిధులపై సెనేట్ సబ్‌కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు ఆయన వెల్లడించారు. పరారీలో ఉన్న భారత అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో డీ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. పలు తీవ్ర నేరాలు, ముంబయి ఉగ్రదాడులతో ప్రమేయం ఉన్న దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నాడని భారత్, అమెరికా చెబుతుండగా, తమ దేశంలో లేడని పాక్ అధికారులు నిరాకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment