దావుద్ అరెస్ట్ కు యూఎస్ తో జాయింట్ ఆపరేషన్: షిండే
1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్ పక్కా ప్రణాళికను రూపొందిస్తోంది. పాకిస్థాన్ లో తలదాచుకున్నట్టు వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకుని దావుద్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దావూద్ ను వేటాడేందుకు అమెరికా ప్రభుత్వ సహాకారం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.
ఇప్పటికే కొంత మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశాం. మరికొంత మంది సరిహద్దుల్లో మరణించారు. అయితే దావూద్ ను అరెస్ట్ చేసేందుకు అమెరికా ఎఫ్ బీఐ తో సంప్రదింపులు జరుపుతున్నాం అని షిండే తెలిపారు. ఇప్పటికే దావూద్ పై రెడ్ కార్నర్ నోటిస్ ఉంది. అమెరికాతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకు యూఎస్ అటార్ని జనరల్ ఎరిక్ హోల్డర్ సమ్మతి తెలిపారు. అని షిండే వెల్లడించారు.