ఆఖరి శ్వాస వరకూ దావూద్‌తోనే! | Chhota Shakeel Denies Report of Split in D Company | Sakshi
Sakshi News home page

ఆఖరి శ్వాస వరకూ దావూద్‌తోనే!

Published Thu, Dec 14 2017 8:21 AM | Last Updated on Thu, Dec 14 2017 8:21 AM

Chhota Shakeel Denies Report of Split in D Company - Sakshi

ముంబై : డీ గ్యాంగ్‌లో విభేధాలు వచ్చాయన్న వార్తలపై ఛోటాషకీల్‌ తాజాగా స్పందించారు. దావూద్‌ ఇబ్రహీంతో తనకు ఎటువంటి విభేధాలు లేవని.. ఆఖరి శ్వాస వరకూ అతనితో ఉంటానని ఛోటా షకీల్‌ స్పష్టం చేశారు. అండర్‌ వరల్డ్‌లో డీ కంపెనీ కోసమే పనిచేస్తానని ఛోటా షకీల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. దావూద్‌ ఇబ్రహీంతో వచ్చిన విభేధాల వల్ల ఛోటా షకీల్‌ వేరు కుంపటి పెట్టుకున్నట్లు వచ్చిన నిఘా సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దావూద్‌ గొడవలు వచ్చాయనడం కేవలం​ పుకార్లు మాత్రమేనని ఛోటా షకీల్‌ అన్నారు. తన చివరి శ్వాస వరకూ డీ కంపెనీకే పనిచేస్తానని ఛోటా షకీల్‌ తాజాగా పేర్కొన్నారు. ఒక గుర్తుతెలియన ప్రాంతం నుంచి ఛోటా షకీల్‌ జీ న్యూస్‌కు ఈ విషయాన్ని తెలిపారు. అదే సమయంలో ‘నేను భాయ్‌తో ఎప్పటిలాగే ఉన్నా. ఇకముందు ఉంటాను’ అని తెలిపారు.  డీ గ్యాంగ్‌లో దావూద్‌కు ఛోటా షకీల్‌ను కుడి భుజంగా వ్యవహరిస్తారు.

డీ గ్యాంగ్‌లో దావూద్‌ సోదరుడు అనీస్‌ పాత్ర పెరగడంతో.. షోటా షకీల్‌ దావూద్‌కు దూరమయినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో దావూద్‌ను, ఛోటా షకీల్‌ను కలిపేందుకు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేసిం‍దని తెలిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement