డీ గ్యాంగ్‌ కోడ్స్‌ ఇవే... | Dawood's new code words revealed | Sakshi
Sakshi News home page

డీ గ్యాంగ్‌ కోడ్స్‌ ఇవే...

Published Fri, Sep 29 2017 10:34 AM | Last Updated on Fri, Sep 29 2017 12:35 PM

Dawood's new code words revealed

సాక్షి, న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కోడ్‌ పదాల గురించి పోలీసులు అదుపులోకి తీసుకున్న గ్యాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ కస్కర్‌ పలు వివరాలు వెల్లడించాడు. నేర కార్యకలాపాలను చేపట్టే క్రమంలో దావూద్‌ నడిపే డీ కంపెనీ వాడే కోడ్‌ పదాలను ఇక్బాల్‌ వివరించాడు. వీరు మోదీ, ఢిల్లీ పదాలను చోటా షకీల్‌, కరాచీలకు కోడ్‌ పదాలుగా వాడతారని వెల్లడించాడు.ఇక దావూద్‌ ఇబ్రహీంను డీ గ్యాంగ్‌ బడే అనే కోడ్‌తో పిలుస్తుంది. పోలీస్‌ వాహనాన్ని డబ్బాగా వ్యవహరిస్తారు.

రూ లక్షను ఏక్‌ డబ్బాగా పేర్కొంటారు. రూ కోటికి ఏక్‌ బాక్స్‌ కోడ్‌ వాడతారని కస్కర్‌ పోలీసులతో పేర్కొన్నట్టు సమాచారం. తమ ఆపరేటర్లతో మాట్లాడే సందర్భంలో దావూద్‌ గ్యాంగ్‌ ఈ కోడ్‌ పదాలను ప్రయోగిస్తుంది. ఈ వివరాలతో పాటు తన సోదరులు దావూద్‌, అనీస్‌ ఇబ్రహీంలు పాకిస్తాన్‌లో ఉన్నారని కస్కర్‌ నిర్ధారించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నుంచి తప్పించుకునేందుకు వారు ఎలాంటి పత్రాలు లేకుండా దుబాయ్‌ వెళుతుంటారని పేర్కొన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement