ప్యాడ్‌మ్యాన్‌ చాలెంజ్‌ | Twinkle Khanna, Aamir Khan Poses With Sanitary Pad In 'PadMan Challenge' | Sakshi
Sakshi News home page

ప్యాడ్‌మ్యాన్‌ చాలెంజ్‌

Published Sat, Feb 3 2018 1:01 AM | Last Updated on Sat, Feb 3 2018 1:01 AM

Twinkle Khanna, Aamir Khan Poses With Sanitary Pad In 'PadMan Challenge' - Sakshi

ఆమిర్‌ఖాన్‌

ఐస్‌ బకెట్‌ చాలెంజ్, రైస్‌ బకెట్‌ చాలెంజ్‌ అంటూ ట్రెండ్‌కు తగ్గట్టు చాలా చాలెంజ్‌లు చూశాం. ఇప్పుడు మరో చాలెంజ్‌ను మన ముందుకు తీసుకు వస్తున్నారు ఆమిర్‌ ఖాన్‌. అదే ‘ప్యాడ్‌మ్యాన్‌ చాలెంజ్‌’. అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ ముఖ్య తారలుగా ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్‌’.  ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్‌ఖాన్‌ ఈ ‘ప్యాడ్‌మ్యాన్‌’ చాలెంజ్‌’ స్టార్ట్‌ చేశారు.
అరుణాచలమ్‌ మురుగనాథమ్‌ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేప్‌కిన్‌లను తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు.

ఆ విధంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణాచలమ్‌ కథతో ఈ ‘ప్యాడ్‌మ్యాన్‌’ తీశారు. ఇతరుల్లో అవగాహన కలిగించే ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువ అవ్వాలని ఆమిర్‌ ఈ ‘ప్యాడ్‌మ్యాన్‌’ చాలెంజ్‌కు నాంది పలికారు. ఇంతకీ ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాకి, ఆమిర్‌కీ సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఈ సినిమాను అక్షయ్‌ కుమార్‌ వైఫ్‌ ట్వింకిల్‌ ఖన్నా నిర్మించారు. ట్వింకిల్, ఆమిర్‌ మంచి స్నేహితులు. ట్వింకిల్‌ అడగ్గానే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారీ మిస్టర్‌

పర్ఫెక్షనిస్ట్‌.
ఫొటోలో చూస్తున్నారుగా! ఆమిర్‌ ఖాన్‌ శానిటరీ ప్యాడ్‌ను ఇలా పట్టుకొని ఫొటో పోస్ట్‌ చేసి ‘‘అవును.. నా చేతిలో ఉన్నది శానిటరీ ప్యాడే. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు. అంతే కాదు.. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌లను కూడా ఇలా శానిటరీ ప్యాడ్‌ పట్టుకొని ఫొటో పోస్ట్‌ చేయమని చాలెంజ్‌ విసిరారు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చేస్తున్నది కాదు. సోషల్‌ అవేర్‌నెస్‌ కోసం స్టార్ట్‌ చేసిన చాలెంజ్‌. ఈ చాలెంజ్‌ ముఖ్య ఉద్దేశం ప్యాడ్స్‌ గురించి మాట్లాడటానికి మనం సిగ్గుపడకూడదని. ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement