సత్యమే
సత్యమే
ఆమిర్‌ఖాన్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమంలో ‘చెత్త’ గురించి ప్రత్యేకంగా ఎపిసోడ్ చేసి చూపించారు. మన దేశంలో చెత్త నిర్వహణే ‘చెత్త’గా ఉందని చెప్పి అందరినీ ఆలోచింపజేశారు ఆమిర్. ఇంట్లోని చెత్తని ఎలా వేరుచేసి ఉపయోగించాలో పాఠ్యపుస్తకాల ద్వారా చిన్నతనంలో తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరంగా బోధించారు. చెత్తతో బయోగ్యాస్ ఎలా తయారుచేయాలో, వెర్మీ కంపోస్ట్‌గా ఎలా ఉపయోగించుకోవాలో క్లాస్‌రూమ్‌లలో తెలియజేయడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికీ దాని అవసరం గురించి, విధానం గురించి సులువుగా తెలుస్తుందని చెప్పాడు.
ఈరోజు పర్యావరణానికి ముప్పు వస్తుందని చెప్పి ఉన్నట్టుండి చెత్త గురించి బోధనలు మొదలుపెడితే సాధారణ మహిళకు ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. పరిశుభ్రత ఇంటి నుంచే మొదలవ్వాలనీ, మన ఇంటి చెత్త ప్రపంచానికి ముప్పు కాకూడదనీ హితవుచెప్పి ముగించారు. ఈ ఎపిసోడ్‌కి వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.