జాకీ యోగా! | Jackie chan yoga! | Sakshi
Sakshi News home page

జాకీ యోగా!

Published Tue, Sep 29 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

జాకీ యోగా!

జాకీ యోగా!

‘కుంగ్ ఫూ యోగా’....యాక్షన్ సూపర్ స్టార్ జాకీచాన్ నటించే ఈ సినిమా కోసం ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  భారత్-చైనాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న  ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్  దర్శకుడు.  ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్‌లు నటిస్తారని టాక్ రావడంతో ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

బిజీ షెడ్యూల్స్ కారణంగా వారిద్దరూ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. జాకీచాన్ శైలిలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.  33 రోజుల పాటు దుబాయ్‌లోనే యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత మరో షెడ్యూల్ కోసం జాకీచాన్ భారత్ రానున్నారు. ‘ద మిత్’ తర్వాత భారత్‌లో షూటింగ్‌లో జరుపుకునే జాకీచాన్ రెండో సినిమా ఇదే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement