కత్రినా ఇంకా ఓకే చెప్పలేదు! | Katrina 'yet to' decide on film with Jackie Chan | Sakshi
Sakshi News home page

కత్రినా ఇంకా ఓకే చెప్పలేదు!

Published Tue, Jun 23 2015 5:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కత్రినా ఇంకా ఓకే చెప్పలేదు! - Sakshi

కత్రినా ఇంకా ఓకే చెప్పలేదు!

న్యూఢిల్లీ: బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కత్రినా కైఫ్ 'కుంగ్ ఫూ యోగా' మూవీలో నటించనుందన్న వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. హాంకాంగ్ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ జాకీ చాన్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ మూవీలో అతడి సరసన ఆమె నటించనుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ సినిమాకు కత్రినా ఇంకా ఓకే చెప్పలేదని ఆమె అసిస్టెంట్ మంగళవారం తెలిపారు.

'కుంగ్ ఫూ యోగా' కథ విషయానికోస్తే.. చైనీస్ విశ్వవిద్యాలయంలో భారతీయ ప్రొఫెసర్ పాత్రలో కత్రినా నటించనున్నారని, జాకీ చాన్ ఆర్కియాలజిస్ట్ పాత్ర పోషించనున్నారని తెలుస్తుంది. మగధ సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలను ఆమెకు చాన్ వివరిస్తాడని, కత్రినాకు తోడ్పడతాడన్నది కథలో భాగంగా ఉందని వినికిడి. తొలుత బాలీవుడ్ సినీవర్గాలు స్టాన్లీ టొంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని అనుకున్నాయి. 'పీకే' తర్వాత 'దంగల్' మూవీతో బిజీగా ఉన్నట్లు, 'కుంగ్ ఫూ యోగా' లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమిర్ ఖండిచాడు. ప్రస్తుతం 'ఫితూర్', 'జగ్గా జాసూస్' మూవీలతో బాలీవుడ్ బ్యూటీ క్యాట్స్ బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement