
‘‘ఎంత అందంగా ఉంటుందో అంతే అంద మైన మనసు కత్రినా కైఫ్‌కు ఉందని మనకు తెలుసు. ఎవర్నీ బాధించకూడదన్న ఆమె ప్రవర్తన మనల్ని మరింత ప్రేమించేలా చేస్తుంది. ఎవ్వరూ చూడనప్పుడు ఎంత స్వేచ్ఛగా డ్యాన్స్ చేస్తామో, సెట్‌లో కూడా ఆమె అంతే బాగా చేస్తుంది. భూలోకాన్నే స్వర్గంగా భావించి జీవిస్తుంది. కత్రినా బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్’’ ఇలా పొగుడుతూ ఆమెకు హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్పారు షారుక్ ఖాన్. కత్రినా కైఫ్ బర్త్‌డే సందర్భంగా ‘జీరో’ సినిమాలో ఆమె లుక్‌ను కూడా రిలీజ్ చేశారు.
‘తను వెడ్స్ మను’ సిరీస్ ఫేమ్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జీరో’. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ అతిథి పాత్ర పోషించారు. టీజర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment