Kung Fu Yoga
-
డియర్ సోనూ... ఇది నీకోసం
ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రత్యేక బహుమతితో పాటు ఆత్మీయ లేఖ అందుకోవడమే సోనూ ఆనందానికి కారణం. ఇంతకీ ఆ ఆత్మీయులు ఎవరంటే.. ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్. ఇండో- చైనీస్ భాగస్వామ్యంలో ‘కుంగ్ ఫూ యోగా’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో జాకీ చాన్, సోనూ సూద్ మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి జాకీ చాన్ సోనూ సూద్‌కు ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నాడు. తాజాగా జేసీ స్టంట్ టీమ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లెదర్ జాకెట్‌ను సోనూకి పంపించాడు. దానితో పాటు ఒక ఆత్మీయ లేఖ కూడా రాసి సర్ప్రైజ్ చేశాడు. ‘మై డియర్ సోనూ.. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న సోదరులతోపాటు అతి కొద్ది మంది ఆత్మీయులకు మాత్రమే ఈ కానుక ఇస్తున్నాను. ఇది చిన్న కానుకే అయి ఉండవచ్చు కానీ దీన్ని చూసిన ప్రతీసారీ నీకు నేను గుర్తొస్తాను. అప్పుడు నేను నీతోపాటుగా ఉన్నట్టే నువ్వు భావిస్తావు’ అంటూ భావోద్వేగంతో కూడిన లేఖ జతచేశాడు. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ నుంచి బహుమతులతో పాటు ఆత్మీయ లేఖలు కూడా అందుకోవటం ఎవరికైనా సంతోషమే కదా.. సోనూ సూద్ కూడా ఇపుడు ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో కూడా జాకీ చాన్ ‘అయామ్ జాకీచాన్: మై లైఫ్ ఇన్ యాక్షన్’ అనే బుక్‌తో పాటు, నీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ లేఖ రాశాడు. -
ఇండియాలో ఫ్లాప్.. రూ.1200 కోట్ల కలెక్షన్లు!
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’ భారత్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా అంతర్జాతీయంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా చైనాలో కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లు(180 మిలియన్ డాలర్లు) కలెక్షన్లు రాబట్టిందని ‘బాక్సాఫీస్ మోజో’ వెల్లడించింది. ఇందులో ఒక్క చైనాలోనే 179 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. జాకీచాన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన రోజు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే రాబట్టిందని ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో బాలీవుడు నటులు సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు. -
జాకీ మార్క్ యాక్షన్‌తో...
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’. సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రపంచవ్యాప్తంగా జాకీచాన్ సినిమాలను అందరూ ఇష్టపడతారు. గతంలో తెలుగులో వచ్చిన జాకీచాన్ చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. స్టాన్లీ టాంగ్, జాకీచాన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘రంబుల్ ఇన్ ది బ్రాంక్స్’, ‘ది మిత్’, ‘చైనీస్ జోడియాక్’ వంటి చిత్రాలు కలెక్షన్ లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. మరోసారి వీరి కలయికలో వస్తోన్న ‘కుంగ్ ఫూ యోగ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జాకీచాన్ మార్క్ యాక్షన్ కామెడీతో పాటు ఫ్రెష్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రంలోని పలు రకాల జంతువులు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తాం’’ అన్నారు. -
కపిల్ షోలో ఈసారి గెస్ట్ ఎవరో తెలుసా?
-
కపిల్ షోలో ఈసారి గెస్ట్ ఎవరో తెలుసా?
టీవీ టాక్ షోలలో కపిల్ శర్మ పేరు దేశంలో మార్మోగిపోతుంటుంది. సినిమా సెలబ్రిటీలను పిలవడం, త్వరలో విడుదల కాబోతున్న వాళ్ల సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఆగకుండా గంట పాటు విపరీతంగా నవ్వించే కపిల్ షో అంటే చాలామందికి క్రేజ్. హీరోయిన్లను తనదైన శైలిలో ఆరాధించే కపిల్ చేష్టలు చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే. అలాంటి షోకు ఈసారి ఎవరు వస్తున్నారో తెలుసా.. సాక్షాత్తు జాకీ చాన్!! అవును.. ఇప్పటికే షారుక్, సల్మాన్ సహా పెద్ద పెద్ద స్టార్లందరినీ తన షోలోకి తీసుకొచ్చిన కపిల్ శర్మ ఇప్పుడు రాబోతున్న అతిథి గురించి తెలిసి ఒక్కసారిగా షాకయ్యాడు. తాను నటించిన సినిమా 'కుంగ్‌ఫూ యోగా' ప్రమోషన్ కోసం జాకీ చాన్ ఈ షోకు రావాలని నిర్ణయించుకున్నాడట. ఆ విషయాన్ని కపిల్ ట్వీట్ చేశాడు. 'ఓ మై గాడ్.. కపిల్ షోలో జాకీచాన్' అని ఒక్క లైన్ మాత్రమే పెట్టాడు. కుంగ్‌ఫూ యోగా సినిమాలో బాలీవుడ్ నటీ నటులు దిశాపటానీ, సోనూ సూద్, అమైరా దస్తూర్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో జాకీచాన్‌ది ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్ర. Oh my god .. #jackiechanontkss — KAPIL (@KapilSharmaK9) 23 January 2017 -
సినీ ఇండస్ట్రీపై హీరో ఆసక్తికర కామెంట్స్
న్యూఢిల్లీ: సినిమా రంగంలో రాణించాలంటే నటించడం వస్తే సరిపోదని అంటున్నారు విలక్షణ నటుడు సోనూసూద్. అందునా బాలీవుడ్లో పేరు తెచ్చుకోవడం మామూలు విషయమేమీ కాదని, అక్కడ మిగతా వాళ్లకంటే భిన్నంగా, రోజుకో విధంగా మనదైన ప్రత్యేకత చాటుకుంటేతప్ప నిలబడలేమని వ్యాఖ్యానించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్.. ఇలా ప్రాంతీయ, భాషాబేధాలకు అతీతంగా సినిమాలు చేస్తోన్న ఆయన.. జాకీచాన్‌తో కలిసి 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 28న చైనాలో, ఫిబ్రవరి 3న ఇండియాలో విడుదలకానున్న నేపథ్యంలో సోనూ బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మోడలింగ్ నుంచి బాలీవుడ్‌లోకి నటుడిగా అడుపెట్టిన రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అయితే ప్రతి సందర్భంలోనూ తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో గట్టెక్కగలిగానని సోనూసూద్ చెప్పారు. రంగప్రవేశం చేసిన చాలా రోజులకుగానీ 'బ్రేక్‌త్రూ' వచ్చిందని గుర్తుచేసుకున్నారు. గత ఏడాది ఆస్కార్ అవార్డులకుగానూ చైనా తరఫున ఎంపికైన ఏకైక చిత్రం 'జువాన్జాంగ్' సినిమాలనూ సోనూ ఓ ముఖ్యపాత్ర పోషించారు. వచ్చే నెలలో విడుదలయ్యే 'కుంగ్‌ఫూ యోగా'కూడా రెండు దేశాల్లో హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 'తూతక్ తూతక్ తూతియా'(తెలుగులో 'అభినేత్రి') సినిమాతో సోనూ నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. -
జాకీచాన్‌కు హిందీలో తిట్లు నేర్పించా: నటి
ఇండో-చైనీస్ ప్రొడక్షన్లో వస్తున్న 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో జాకీచాన్ సరసన హీరోయిన్గా నటిస్తున్న అమైరా దస్తురా తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ ఇంటర్నేషనల్ మెగాస్టార్‌కి సరదాగా హిందీలో కొన్ని చెడ్డ పదాలు, తిట్లు నేర్పించానని ఆమె చెప్పుకొచ్చింది. ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ముచ్చటించిన ఈ భామ అయితే తాను ఏం పదాలు జాకీచాన్‌కు నేర్పించాననే విషయాన్ని వెల్లడించలేదు. 'షుక్రియా' అన్న పదానికి బదులు ఓ సభ్యోక్తిని జాకీచాన్‌కు తాను నేర్పించానని, ఆ పదాన్ని తన భారతీయ సహ నటుడు సోనూ సోద్ను ఉద్దేశించి జాకీచాన్ అనడంతో ఆయన కంగుతిన్నారని పేర్కొంది. 'సోనూ నా దగ్గరికి వచ్చి జాకీచాన్ మంచి హిందీ పదాలు నేర్పించాలని కోరాడు. ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు పొరపాటున ఇలాంటి చెడ్డ పదాలు ఉపయోగిస్తే.. చిక్కులు వస్తాయని చెప్పాడు. ఆయన ముందు నాకేం తెలియనట్టు అమాయకంగా నటించాను' అని అమైరా కొంటెగా తెలిపింది. జాకీచాన్ గొప్ప నటుడని, ఆయనలో అపారమైన ఎనర్జీ ఉంటుందని అమైరా ప్రశంసల్లో ముంచెత్తింది. ఇంతటి స్టార్డమ్ ఉన్నా ఆయన ప్రజలకు నిత్యం ఏదో ఇవ్వాలని తపిస్తుంటారని కొనియాడారు. -
ఇప్పటికీ నేను చాలా చిన్నదాన్ని: నటి
ముంబై: లోఫర్ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన భామ దిశా పటానీ. ఆ మూవీ ఆమెకు అంతగా కలిసిరాకపోవడంతో వెంటనే బాలీవుడ్ బాట పట్టింది. భారత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ జీవిత కథాంశం ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ'లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు జోడీగా నటించింది. ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని మీడియా ప్రశ్నలకు తన మనసులో మాట బయటపెట్టింది. బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోకరమైన విషయం. సినిమాలు సక్సెస్ అవుతాయి.. ఫెయిల్ అవుతాయి.. వాటి గురించి అంతగా పట్టించుకోను. అయినా సూపర్ స్టార్ అయిపోవాలని నేను కలల కనలేదుగా అంటోంది ఈ ముద్దుగుమ్మ. 'మూవీలలో నటించడమే నా పని. కెమెరా ముందుకు రాగానే మెరుగ్గా నటించేందుకు ప్రయత్నిస్తాను. ఇంకా చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీకి నేను చాలా చిన్నదాన్నే. బాలీవుడ్ లో కేవలం ఒకే మూవీ చేశాను. దిగ్గజ నటుడు జాకీచాన్ తో నటించిన 'కుంగ్ ఫు యోగా' వచ్చే జనవరి 28న విడుదల అవుతుంది. మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అదే ఫార్ములాను ఎప్పటికీ ఫాలో అవుతాను' అని దిశా పటానీ చెప్పుకొచ్చింది. -
జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్
ఎంఎస్ ధోనీ ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో ధోనీ ప్రియురాలిగా చేసిన దిశా పటానీ గుర్తుందా? ఈ బ్లాక్‌బస్టర్ సినిమాతో పాటు ఇంతకు ముందు లోఫర్ సినిమాలో కూడా చేసిన ఈ హీరోయిన్.. ఏకంగా జాకీచాన్‌కు డాన్సు నేర్పించిందట. కుంగ్‌ఫూ యోగా సినిమాలో చాన్‌తో పాటు కలిసి చేసిన ఈమె.. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలో ఒక పాటకు సంబంధించిన డాన్సును చాన్‌కు నేర్పించిందట. నిజానికి జాకీచాన్‌కు కూడా డాన్సు అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పింది. భారత-చైనా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కుంగ్‌ఫూ యోగా సినిమాలో సోనూ సూద్, అమైరా దస్తూర్ కూడా నటిస్తున్నారు. జాకీ చాన్ తనకు చైనా పాట నేర్పించారని, అందుకు బదులుగా తనవద్ద డాన్సు, హిందీ కూడా నేర్చుకున్నారని దిశా పటానీ చెప్పింది. బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలోని 'తూ మేరీ' పాటకు జాకీచాన్ డాన్సు చేశాడట. సహజంగానే యాక్షన్ స్టార్ కాబట్టి ఆయన శరీరంలో మంచి లయ ఉందని, అందువల్ల మంచి డాన్సర్ కూడా అయ్యారని ప్రశంసలు కురిపించింది. 62 ఏళ్ల వయసులో కూడా చాన్ బలే చురుగ్గా కదులుతారని చెప్పింది. తొలిసారి తాను ఆయనను కలిసినప్పుడు అసలు నమ్మలేకపోయానని, తన దగ్గరకు వచ్చి మాట్లాడగానే.. 'ఓ మై గాడ్.. ఆయన నాతో మాట్లాడారు, నా పేరు కూడా తెలుసు' అనుకున్నానని దిశా పటానీ చెప్పింది. ఫైట్లకే మారుపేరు అయిన చాన్‌తో కలిసి ఫైట్లు చేయడం అంటే.. తనకు నవ్వు వచ్చేదని కూడా తెలిపింది. ఈ సినిమాలో ఫైట్లు చేసే హీరోయిన్ కోసం వాళ్లు చూస్తున్నారని.. తాను అప్పటికే ఏడాదిన్నర నుంచి జిమ్నాస్టిక్స్, కిక్స్ చేస్తున్నానని, దాంతో వాళ్లు తనను పిలిచి ఆడిషన్ పెట్టగానే ఎంపికయ్యానని చెప్పింది. -
ఎలుకకు డబ్బింగ్ చెపుతున్న జాకీచాన్
ప్రస్తుతం ఇండో చైనీస్ కథతో తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా చిత్రంలో నటిస్తున్న జాకీచాన్ మరో హాలీవుడ్ సినిమా కోసం గాత్రదానం చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ యానిమేషన్ సీరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న ది నట్ జాబ్ 2 సినిమాలోని లీడ్ క్యారెక్టర్‌కు జాకీ చాన్ డబ్బింగ్ చెబుతున్నాడు. ఎలుకల గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించే ఎలుక పాత్రకు జాకీ గాత్రదానం చేయటం విశేషం. గతంలోనూ కుంగ్ ఫూ పాండా సీరీస్‌లో రూపోందిన చిత్రాలకు జాకీ డబ్బింగ్ చెప్పారు. కాల్ బ్రంకర్, కేథెరిన్ హీగిల్, విల్ ఆర్నెట్ లాంటి హాలీవుడ్ టెక్నిషియన్స్ ద నట్ జాబ్ 2 సినిమాకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాను 2017లో మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
హాలీవుడ్ స్టార్ హీరో.. బాలీవుడ్ డ్యాన్స్
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్ కొద్ది రోజులు భారత్‌లో సందడి చేస్తున్నాడు. తన కొత్త సినిమా కుంగ్ ఫూ యోగా కోసం షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీతో పాటు పలువురు భారతీయ నటులు కూడా కనిపించనున్నారు. ఇందులో భాగంగా తాజా షెడ్యూల్లో జాకీ చాన్, సోనూసూద్లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొరియోగ్రాఫిలో జాకీ చేసిన ఇండియన్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జోద్ పూర్, మండోర్ గార్డెన్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలను కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ వెల్లడించారు. జాకీచాన్ తో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫరా, 'యాక్షన్ కింగ్ డ్యాన్ కూడా చేస్తాడు. తన పేరును జాకీ జాక్సన్‌గా మార్చుకోనున్నాడు' అంటూ కామెంట్ చేశారు. సోనూ సూద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ హీరోయిన్స్ అమైరా దస్తర్, దిశ పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. The King of action CAN dance n how!! Changing his name 2 Jackie Jackson!! #kungfu yoga pic.twitter.com/2rcQXvtKeg — Farah Khan (@TheFarahKhan) 4 April 2016 -
గోవా బ్యూటీకి మరో షాక్
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకొని తరువాత బాలీవుడ్ చెక్కేసిన ముద్దుగుమ్మ ఇలియానాకు ఇంకా బ్యాడ్ టైం కొనసాగుతూనే ఉంది. భారీ ఆశలతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామకు అక్కడ కూడా అవకాశాలు కరువవ్వటంతో సౌత్ మీద దృష్టి పెట్టింది. అప్పటికే సౌత్‌లో కొత్త తారలు పాతుకుపోవటంతో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు. కష్టాల్లో ఉన్న ఇలియానాకు హాలీవుడ్ ఆఫర్ రావటంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. యాక్షన్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో భారతీయ వనిత పాత్రకు ఇలియానాను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆఖరి నిమిషయంలో జాకీచాన్ కూడా గోవా బ్యూటీకి హ్యాండ్ ఇచ్చాడు. ఇలియానాతో చేయించాలనుకున్న పాత్రకు కొత్త తార అమైరా దస్తర్ను సెలెక్ట్ చేసుకున్నాడట. భారత్, చైనాలలో సాగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేకుడు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన అమైరా, తెలుగులో మంచు విష్ణు సరసన హీరోయిన్గా నటిస్తోంది. -
జాకీచాన్ సినిమాలో సోనూసూద్
-
జాకీచాన్ సినిమాలో సోనూసూద్
షారూక్ ఖాన్ 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా తరువాత మ్యాన్లీ యాక్టర్ సోనూసూద్ వెండితెర మీద కనిపించడం మానేశాడు. అప్పుడప్పుడు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో కనిపిస్తున్నా తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాత్రం స్పందించలేదు. మీడియా అడిగిన సందర్భంలో కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌తో త్వరలోనే మీ ముందుకు వస్తానని చెబుతూ వచ్చాడు. అన్నట్టుగానే ఓ అంతర్జాతీయ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సోనూసూద్. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ హీరోగా నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు సోనూసూద్. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనూసూద్, జాకీచాన్ పాత్రతో సమానమైన పాత్రలో నటించనున్నాడట. అందుకే భారతీయ చిత్రాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు సోనూ. బీజింగ్ తో పాటు భారత్ లోనూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సోనూసూద్, ఇక అంతర్జాతీయ సినీ అభిమానులకు చేరువైనట్టే అంటున్నారు విశ్లేషకులు. -
జాకీ యోగా!
‘కుంగ్ ఫూ యోగా’....యాక్షన్ సూపర్ స్టార్ జాకీచాన్ నటించే ఈ సినిమా కోసం ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్-చైనాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్ దర్శకుడు. ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్‌లు నటిస్తారని టాక్ రావడంతో ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజీ షెడ్యూల్స్ కారణంగా వారిద్దరూ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. జాకీచాన్ శైలిలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. 33 రోజుల పాటు దుబాయ్‌లోనే యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత మరో షెడ్యూల్ కోసం జాకీచాన్ భారత్ రానున్నారు. ‘ద మిత్’ తర్వాత భారత్‌లో షూటింగ్లో జరుపుకునే జాకీచాన్ రెండో సినిమా ఇదే. -
ప్రొఫెసర్ కత్రినా కత్తి తప్పితే!
ఇప్పుడు మనం కత్రినా కైఫ్‌ను ‘గ్లామర్ డాల్’గా మాత్రమే పరిమితం చేయలేం. గతంతో పోల్చితే ఆమె నటనలో పరిణతి వచ్చింది. పాత్రలను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. నృత్యంలోనూ మంచి ప్రతిభ చూపుతుంది. మార్షల్ ఆర్ట్స్ సూపర్‌స్టార్ జాకీ చాన్ సరసన ‘కుంగ్ ఫూ యోగ’ అనే అంతర్జాతీయ చిత్రంలో కత్రినా నటిస్తుంది. కేవలం గ్లామర్ కోసం కాకుండా హీరోకి సరిసమానంగా కత్రినా పాత్రను తీర్చిదిద్దాడట డెరైక్టర్ స్టాన్లీ టాంగ్. ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న కత్రినా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా తన సత్తా చూపనుందట. సల్మాన్‌ఖాన్ ‘ఏక్తా టైగర్’ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్లు చేసింది కత్రినా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీన్లు ‘కుంగు ఫూ యోగ’లో చేయనుందట. దీని కోసం జాకీ చాన్ దగ్గర శిక్షణ కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపుతుందట. అంతేనా...మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన పుస్తకాలను కూడా తెగ చదివేస్తుందట. వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈలోపే కొందరు బాలీవుడ్ డెరైక్టర్లు కత్రినాను దృష్టిలో పెట్టుకొని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కథలు రాసుకోవడం మొదలుపెట్టారట! -
కత్రినా ఇంకా ఓకే చెప్పలేదు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కత్రినా కైఫ్ 'కుంగ్ ఫూ యోగా' మూవీలో నటించనుందన్న వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. హాంకాంగ్ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ జాకీ చాన్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ మూవీలో అతడి సరసన ఆమె నటించనుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ సినిమాకు కత్రినా ఇంకా ఓకే చెప్పలేదని ఆమె అసిస్టెంట్ మంగళవారం తెలిపారు. 'కుంగ్ ఫూ యోగా' కథ విషయానికోస్తే.. చైనీస్ విశ్వవిద్యాలయంలో భారతీయ ప్రొఫెసర్ పాత్రలో కత్రినా నటించనున్నారని, జాకీ చాన్ ఆర్కియాలజిస్ట్ పాత్ర పోషించనున్నారని తెలుస్తుంది. మగధ సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలను ఆమెకు చాన్ వివరిస్తాడని, కత్రినాకు తోడ్పడతాడన్నది కథలో భాగంగా ఉందని వినికిడి. తొలుత బాలీవుడ్ సినీవర్గాలు స్టాన్లీ టొంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని అనుకున్నాయి. 'పీకే' తర్వాత 'దంగల్' మూవీతో బిజీగా ఉన్నట్లు, 'కుంగ్ ఫూ యోగా' లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమిర్ ఖండిచాడు. ప్రస్తుతం 'ఫితూర్', 'జగ్గా జాసూస్' మూవీలతో బాలీవుడ్ బ్యూటీ క్యాట్స్ బిజీగా ఉంది.