గోవా బ్యూటీకి మరో షాక్
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకొని తరువాత బాలీవుడ్ చెక్కేసిన ముద్దుగుమ్మ ఇలియానాకు ఇంకా బ్యాడ్ టైం కొనసాగుతూనే ఉంది. భారీ ఆశలతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామకు అక్కడ కూడా అవకాశాలు కరువవ్వటంతో సౌత్ మీద దృష్టి పెట్టింది. అప్పటికే సౌత్లో కొత్త తారలు పాతుకుపోవటంతో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు.
కష్టాల్లో ఉన్న ఇలియానాకు హాలీవుడ్ ఆఫర్ రావటంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. యాక్షన్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో భారతీయ వనిత పాత్రకు ఇలియానాను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆఖరి నిమిషయంలో జాకీచాన్ కూడా గోవా బ్యూటీకి హ్యాండ్ ఇచ్చాడు. ఇలియానాతో చేయించాలనుకున్న పాత్రకు కొత్త తార అమైరా దస్తర్ను సెలెక్ట్ చేసుకున్నాడట.
భారత్, చైనాలలో సాగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేకుడు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన అమైరా, తెలుగులో మంచు విష్ణు సరసన హీరోయిన్గా నటిస్తోంది.