జాకీచాన్‌కు హిందీలో తిట్లు నేర్పించా: నటి | I taught Jackie Chan Hindi abuses, says Amyra Dastur | Sakshi
Sakshi News home page

జాకీచాన్‌కు హిందీలో తిట్లు నేర్పించా: నటి

Published Mon, Jan 9 2017 4:43 PM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

జాకీచాన్‌కు హిందీలో తిట్లు నేర్పించా: నటి - Sakshi

జాకీచాన్‌కు హిందీలో తిట్లు నేర్పించా: నటి

ఇండో-చైనీస్‌ ప్రొడక్షన్‌లో వస్తున్న 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో జాకీచాన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న అమైరా దస్తురా తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ ఇంటర్నేషనల్‌ మెగాస్టార్‌కి సరదాగా హిందీలో కొన్ని చెడ్డ పదాలు, తిట్లు నేర్పించానని ఆమె చెప్పుకొచ్చింది. ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ముచ్చటించిన ఈ భామ అయితే తాను ఏం పదాలు జాకీచాన్‌కు నేర్పించాననే విషయాన్ని వెల్లడించలేదు.

'షుక్రియా' అన్న పదానికి బదులు ఓ సభ్యోక్తిని జాకీచాన్‌కు తాను నేర్పించానని, ఆ పదాన్ని తన భారతీయ సహ నటుడు సోనూ సోద్‌ను ఉద్దేశించి జాకీచాన్‌ అనడంతో ఆయన కంగుతిన్నారని పేర్కొంది. 'సోనూ నా దగ్గరికి వచ్చి జాకీచాన్‌ మంచి హిందీ పదాలు నేర్పించాలని కోరాడు. ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు పొరపాటున ఇలాంటి చెడ్డ పదాలు ఉపయోగిస్తే.. చిక్కులు వస్తాయని చెప్పాడు. ఆయన ముందు నాకేం తెలియనట్టు అమాయకంగా నటించాను' అని అమైరా కొంటెగా తెలిపింది. జాకీచాన్‌ గొప్ప నటుడని, ఆయనలో అపారమైన ఎనర్జీ ఉంటుందని అమైరా ప్రశంసల్లో ముంచెత్తింది. ఇంతటి స్టార్‌డమ్‌ ఉన్నా ఆయన ప్రజలకు నిత్యం ఏదో ఇవ్వాలని తపిస్తుంటారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement