Hindi abuses
-
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
జాకీచాన్‌కు హిందీలో తిట్లు నేర్పించా: నటి
ఇండో-చైనీస్ ప్రొడక్షన్లో వస్తున్న 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో జాకీచాన్ సరసన హీరోయిన్గా నటిస్తున్న అమైరా దస్తురా తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ ఇంటర్నేషనల్ మెగాస్టార్‌కి సరదాగా హిందీలో కొన్ని చెడ్డ పదాలు, తిట్లు నేర్పించానని ఆమె చెప్పుకొచ్చింది. ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ముచ్చటించిన ఈ భామ అయితే తాను ఏం పదాలు జాకీచాన్‌కు నేర్పించాననే విషయాన్ని వెల్లడించలేదు. 'షుక్రియా' అన్న పదానికి బదులు ఓ సభ్యోక్తిని జాకీచాన్‌కు తాను నేర్పించానని, ఆ పదాన్ని తన భారతీయ సహ నటుడు సోనూ సోద్ను ఉద్దేశించి జాకీచాన్ అనడంతో ఆయన కంగుతిన్నారని పేర్కొంది. 'సోనూ నా దగ్గరికి వచ్చి జాకీచాన్ మంచి హిందీ పదాలు నేర్పించాలని కోరాడు. ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు పొరపాటున ఇలాంటి చెడ్డ పదాలు ఉపయోగిస్తే.. చిక్కులు వస్తాయని చెప్పాడు. ఆయన ముందు నాకేం తెలియనట్టు అమాయకంగా నటించాను' అని అమైరా కొంటెగా తెలిపింది. జాకీచాన్ గొప్ప నటుడని, ఆయనలో అపారమైన ఎనర్జీ ఉంటుందని అమైరా ప్రశంసల్లో ముంచెత్తింది. ఇంతటి స్టార్డమ్ ఉన్నా ఆయన ప్రజలకు నిత్యం ఏదో ఇవ్వాలని తపిస్తుంటారని కొనియాడారు.