
టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. తాజాగా ఈ గోవా బ్యూటీ ఓ టాలీవుడ్ సినిమాకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనున్నారు. అల్లు అర్జున్ సరసన నటించిన జులాయి తరువాత ఇలియానా చేస్తున్న తెలుగు సినిమా ఇదే.
Comments
Please login to add a commentAdd a comment