
మన చేతికి ఉన్న ఐదు వేళ్లు సమానంగా ఉండవు. అలాగే క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉండరు. అలాంటప్పుడు మన గురించి అందరి అభిప్రాయాలు ఒకేలా ఎందుకు ఉంటాయి? మనల్ని అభిమానించే వాళ్లు ఉన్నట్లే, ఇష్టపడనివాళ్లూ ఉంటారు. అందుకే ప్రతి విషయంలోనూ అందరి మెప్పు పొందాలనుకోవడం తెలివితక్కువ పనే అవుతుంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కథానాయిక ఇలియానా. ‘‘ కెరీర్‌లో స్టార్టింగ్‌లో అందర్నీ ఇంప్రెస్ చేయాలని ఎంతో ఆరాటపడేదాన్ని.
లుక్స్ విషయంలో బాగా కేర్ తీసుకునేదాన్ని. ఆ తర్వాత నాకు అర్థం అయ్యింది.. అందర్నీ ఇంప్రెస్ చేయడం ఇంపాజిబుల్ అని. ముఖ్యంగా మనపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను అన్ని వేళలా రీచ్ అయ్యేలా ప్రవర్తించడం ఇంకా కష్టం. అందుకే నన్ను నేను ఒక సెలబ్రిటీగా ఊహించుకోను. యాక్టర్‌ని అని మాత్రమే అనుకుంటాను’’అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆరేళ్ల తర్వాత సౌత్‌లో ఇలియానా కాలుపెడుతున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఇలియానా.
Comments
Please login to add a commentAdd a comment