జాకీ మార్క్‌ యాక్షన్‌తో... | Jackie Chan teams up with Bollywood for 'Kung Fu Yoga' | Sakshi
Sakshi News home page

జాకీ మార్క్‌ యాక్షన్‌తో...

Published Thu, Jan 26 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

జాకీ మార్క్‌ యాక్షన్‌తో...

జాకీ మార్క్‌ యాక్షన్‌తో...

హాలీవుడ్‌ యాక్షన్  హీరో జాకీచాన్  నటించిన తాజా చిత్రం ‘కుంగ్‌ ఫూ యోగ’. సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రపంచవ్యాప్తంగా జాకీచాన్ సినిమాలను అందరూ ఇష్టపడతారు. గతంలో తెలుగులో వచ్చిన జాకీచాన్  చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో  తెలిసిందే.

స్టాన్‌లీ టాంగ్, జాకీచాన్‌ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘రంబుల్‌ ఇన్  ది బ్రాంక్స్‌’, ‘ది మిత్‌’, ‘చైనీస్‌ జోడియాక్‌’ వంటి చిత్రాలు కలెక్షన్ లో బాక్సాఫీస్‌ రికార్డులు సృష్టించాయి. మరోసారి వీరి కలయికలో వస్తోన్న ‘కుంగ్‌ ఫూ యోగ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జాకీచాన్  మార్క్‌ యాక్షన్  కామెడీతో పాటు ఫ్రెష్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఈ చిత్రంలోని పలు రకాల జంతువులు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement