జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్ | Disha Patani taught Jackie Chan steps on 'Bang Bang' song | Sakshi
Sakshi News home page

జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్

Published Thu, Oct 6 2016 12:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్

జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్

ఎంఎస్ ధోనీ ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో ధోనీ ప్రియురాలిగా చేసిన దిశా పటానీ గుర్తుందా? ఈ బ్లాక్‌బస్టర్ సినిమాతో పాటు ఇంతకు ముందు లోఫర్ సినిమాలో కూడా చేసిన ఈ హీరోయిన్.. ఏకంగా జాకీచాన్‌కు డాన్సు నేర్పించిందట. కుంగ్‌ఫూ యోగా సినిమాలో చాన్‌తో పాటు కలిసి చేసిన ఈమె.. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలో ఒక పాటకు సంబంధించిన డాన్సును చాన్‌కు నేర్పించిందట. నిజానికి జాకీచాన్‌కు కూడా డాన్సు అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పింది. భారత-చైనా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కుంగ్‌ఫూ యోగా సినిమాలో సోనూ సూద్, అమైరా దస్తూర్ కూడా నటిస్తున్నారు. జాకీ చాన్ తనకు చైనా పాట నేర్పించారని, అందుకు బదులుగా తనవద్ద డాన్సు, హిందీ కూడా నేర్చుకున్నారని దిశా పటానీ చెప్పింది.

బ్యాంగ్ బ్యాంగ్‌ సినిమాలోని 'తూ మేరీ' పాటకు జాకీచాన్ డాన్సు చేశాడట. సహజంగానే యాక్షన్ స్టార్ కాబట్టి ఆయన శరీరంలో మంచి లయ ఉందని, అందువల్ల మంచి డాన్సర్ కూడా అయ్యారని ప్రశంసలు కురిపించింది. 62 ఏళ్ల వయసులో కూడా చాన్ బలే చురుగ్గా కదులుతారని చెప్పింది. తొలిసారి తాను ఆయనను కలిసినప్పుడు అసలు నమ్మలేకపోయానని, తన దగ్గరకు వచ్చి మాట్లాడగానే.. 'ఓ మై గాడ్.. ఆయన నాతో మాట్లాడారు, నా పేరు కూడా తెలుసు' అనుకున్నానని దిశా పటానీ చెప్పింది. ఫైట్లకే మారుపేరు అయిన చాన్‌తో కలిసి ఫైట్లు చేయడం అంటే.. తనకు నవ్వు వచ్చేదని కూడా తెలిపింది. ఈ సినిమాలో ఫైట్లు చేసే హీరోయిన్ కోసం వాళ్లు చూస్తున్నారని.. తాను అప్పటికే ఏడాదిన్నర నుంచి జిమ్నాస్టిక్స్, కిక్స్ చేస్తున్నానని, దాంతో వాళ్లు తనను పిలిచి ఆడిషన్ పెట్టగానే ఎంపికయ్యానని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement