ఇండియాలో ఫ్లాప్.. రూ.1200 కోట్ల కలెక్షన్లు! | It flopped in India, but Jackie Chan’s Kung Fu Yoga has already made Rs 1200 cr | Sakshi
Sakshi News home page

ఇండియాలో ఫ్లాప్.. రూ.1200 కోట్ల కలెక్షన్లు!

Published Wed, Feb 8 2017 8:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

ఇండియాలో ఫ్లాప్.. రూ.1200 కోట్ల కలెక్షన్లు!

ఇండియాలో ఫ్లాప్.. రూ.1200 కోట్ల కలెక్షన్లు!

హాలీవుడ్‌ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్‌ ఫూ యోగ’ భారత్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా అంతర్జాతీయంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా చైనాలో కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లు(180 మిలియన్ డాలర్లు) కలెక్షన్లు రాబట్టిందని ‘బాక్సాఫీస్ మోజో’ వెల్లడించింది. ఇందులో ఒక్క చైనాలోనే 179 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.

జాకీచాన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన రోజు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే రాబట్టిందని ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో బాలీవుడు నటులు సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement