
ఎలుకకు డబ్బింగ్ చెపుతున్న జాకీచాన్
ప్రస్తుతం ఇండో చైనీస్ కథతో తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా చిత్రంలో నటిస్తున్న జాకీచాన్ మరో హాలీవుడ్ సినిమా కోసం గాత్రదానం చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ యానిమేషన్ సీరీస్లో భాగంగా తెరకెక్కుతున్న ది నట్ జాబ్ 2 సినిమాలోని లీడ్ క్యారెక్టర్కు జాకీ చాన్ డబ్బింగ్ చెబుతున్నాడు.
ఎలుకల గ్యాంగ్కు లీడర్గా వ్యవహరించే ఎలుక పాత్రకు జాకీ గాత్రదానం చేయటం విశేషం. గతంలోనూ కుంగ్ ఫూ పాండా సీరీస్లో రూపోందిన చిత్రాలకు జాకీ డబ్బింగ్ చెప్పారు. కాల్ బ్రంకర్, కేథెరిన్ హీగిల్, విల్ ఆర్నెట్ లాంటి హాలీవుడ్ టెక్నిషియన్స్ ద నట్ జాబ్ 2 సినిమాకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాను 2017లో మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.