
ఆమిర్ ఖాన్
‘ఓషో’ స్క్రిప్ట్‌తో పూర్తిగా సంతృప్తి చెందలేదట బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. దాంతో పారామౌంట్ సంస్థ నిర్మించిన ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా ఏంటో తెలిసిపోయింది. 1994లో రిలీజ్ అయిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాన్ని ఆమిర్ రీమేక్ చేయాలనుకుంటున్నారట. ‘మై నేమ్ ఈజ్ గంప్, ఫారెస్ట్ గంప్’ అంటూ మానసిక వికలాంగుడిగా టామ్ హ్యాంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’. టామ్ హ్యాంక్స్ నటనకు ఆస్కార్ కూడా లభించింది. ఫారెస్ట్ గంప్ అనే వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇండియన్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా మార్పులు చేయిస్తున్నారట ఆమిర్. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయితే ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఇదే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment