సిస్టరాఫ్‌ ఆమిర్‌ | Nikhat Khan will make Bollywood debut in Saand Ki Aankh | Sakshi
Sakshi News home page

సిస్టరాఫ్‌ ఆమిర్‌

Published Sat, May 4 2019 3:14 AM | Last Updated on Sat, May 4 2019 3:14 AM

Nikhat Khan will make Bollywood debut in Saand Ki Aankh - Sakshi

నిఖాత్‌ ఖాన్‌

ఆమీర్‌ ఖాన్‌ నటనలో సూపర్‌ స్టార్‌. పాత్ర పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం ఎంతైనా శ్రమిస్తారు. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ నుంచి ఒకరు యాక్టర్‌గా మారబోతున్నారు. ఆమిర్‌ సోదరి నిఖాత్‌ ఖాన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తాప్సీ, భూమీఫెడ్నేకర్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సాంద్‌ కీ ఆంఖ్‌’. షూటర్స్‌ చంద్రో తోమర్, ప్రకాషీ తోమర్‌ జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నిఖాత్‌ ఖాన్‌ మహారాణి పాత్రలో కనిపిస్తారు. సినిమాలో చిన్న పాత్రలా కాకుండా సినిమా మొత్తం కనిపించే  పాత్ర ఇది అని బాలీవుడ్‌ సమాచారం. మరి సిస్టరాఫ్‌ ఆమిర్‌ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఇంప్రెస్‌ చేస్తారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement