పదేళ్లు ప్రాక్టీస్‌ చేసినా ఆమెలా డ్యాన్స్‌ చేయలేను | Aamir Khan Said He Would Not Have Danced Like Katrina Kaif | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 8:36 PM | Last Updated on Fri, Oct 26 2018 8:41 PM

Aamir Khan Said He Would Not Have Danced Like Katrina Kaif - Sakshi

నేను పదేళ్లు ప్రాక్టీస్‌ చేసినా కత్రినాలా డ్యాన్స్‌ చేయలేనంటున్నారు బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌. వీరిద్దరు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌. ఈ చిత్రంలో కత్రినా సురయ్యా అనే డ్యాన్సర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా నిన్న సురయ్యా టైటిల్‌తో ఉన్న పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో కత్రినా కైఫ్‌ మరోసారి తన డ్యాన్స్‌తో అదరగొట్టారు.

ఈ పాటలో కత్రినా చేసిన హిప్‌ మూవ్‌మెంట్‌ స్టెప్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమిర్‌ ఖాన్‌ సైతం కత్రినా మీద ప్రశంసల వర్షం కురిపించారు. నేను పదేళ్లు ప్రాక్టీస్‌ చేసినా సురయ్యాలాగా డ్యాన్స్‌ చేయలేనని తెలిపారు. చిత్రంలో తమ ఇద్దరి మధ్య వచ్చే ఈ పాట తనకెంతో ఇష్టమని ఆమిర్‌ వెల్లడించారు. ఈ సాంగ్‌ని ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా కంపోజ్‌ చేశారు. ఈ స్టెప్స్‌ అన్ని చాలా కష్టం. కానీ కత్రినా వాటిని చాలా ఇష్టంగా, ఎంతో ఈజ్‌తో చేశారంటూ ప్రభుదేవా కూడా కత్రినాను మెచ్చుకున్నారు. స్టార్‌ రైటర్‌ విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం దీపావళి సందర్భంగా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement