కెవ్వు కేక!
‘కెవ్వు’... ఈ మధ్య ఆమిర్ ఖాన్ నొప్పితో చాలాసార్లు పెట్టిన కేక ఇది. అయ్యో పాపం.. ఆమిర్‌కి ఏమైంది? అనుకుంటున్నారా! మరేం లేదు. తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ కోసం ఆమిర్ చెవులు, ముక్కు కుట్టించుకున్నారు. లేత వయసులో ఉన్నంత సున్నితంగా యాభైఏళ్ల వయసులో ఉన్నవారి చర్మం స్మూత్‌గా ఉండదు కదా.
అందుకని చెవులు, ముక్కు కుట్టేటప్పుడు ఆమిర్ చాలా బాధపడ్డారట. ‘‘ఆ నొప్పి తగ్గడానికి నెల రోజులు పైనే పట్టింది’’ అని ఆమిర్ పేర్కొన్నారు. అంతా ఓకే.. చెవులకీ, ముక్కుకీ ఆభరణాలు పెట్టుకున్న ఆమిర్‌ని చూడాలని ఆయన ఫ్యాన్స్ ఉత్సాహపడ్డారు. ఇదిగో ఇక్కడున్న ఫొటోలో ఆమిర్ ఎలా ఉన్నారో చూశారుగా. సింప్లీ సూపర్బ్ కదా! చెవి, ముక్కు కుట్టించుకున్నప్పుడు ఆమిర్ కెవ్వున కేక పెట్టినా.. గెటప్ మాత్రం కెవ్వు కేక కదా!