రణ్‌బీర్‌ ఇంట్లో రణ్‌వీర్‌ - దీపికా..?! | Deepika Padukone And Ranveer Singh Went To Ranbir Kapoor Home | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌ ఇంట్లో రణ్‌వీర్‌ - దీపికా..?!

Published Thu, Sep 27 2018 11:10 AM | Last Updated on Thu, Sep 27 2018 11:13 AM

Deepika Padukone And Ranveer Singh Went To Ranbir Kapoor Home - Sakshi

ప్రేమ విఫలమయినంత మాత్రానా స్నేహం కూడా చెదిరి పోవాలనేం లేదు. దీపికా పదుకోన్‌ - రణ్‌బీర్‌ కపూర్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ప్రేమకు బ్రేకప్‌ చెప్పుకున్న తర్వాత కూడా వీరిద్దరూ ‘యే జవానీ హై దివానీ’, ‘తమాషా’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి రణ్‌వీర్‌ - దీపికా పదుకోన్‌,​ రణ్‌బీర్‌ సింగ్‌ ఇంటికి వెళ్లారు. అప్పుడు అలియా భట్‌ కూడా అక్కడే ఉన్నారు. ఇంకేం రెండు జంటలు ఎంజాయ్‌ చేయడానికి ఇలా ఒక్క చోట కలిశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీరు నలుగురు మాత్రమే కాకా మరో ముగ్గురు సూపర్‌ స్టార్‌లు కూడా రణ్‌బీర్‌ ఇంటికి వచ్చారు. వారు ఆమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, కరణ్‌ జోహర్‌.

The biggest BLOCKBUSTER ever!!!!!❤️😘😘😘😘

A post shared by Karan Johar (@karanjohar) on

వీరంతా కలిసి ఉన్న ఫోటోను కరణ్‌ జోహార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి, ‘బిగ్గెస్ట్‌ బ్లాక్‌బాస్టర్‌ ఎవర్‌’ అంటూ కాప్షన్‌ పెట్టారు. ఫోటో చూసిన అభిమానుల్లో ‘సూపర్‌ స్టార్‌లు ఒక్క చోట చేరారంటే ఏంటి విషేశం.. వీరందరితో ఏదైనా మల్టీ స్టారర్‌ రాబోతుందా’ అనే అనుమానాలు మొదలయ్యాయి. లేక ‘ఆమిర్‌ ఖాన్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ చిత్రం ప్రమోషన్‌ కోసం వీరంతా ఇలా కలిశారా’ అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ ఫోటో క్యాప్షన్‌ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా అమీర్‌ ఖాన్‌ చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ని ఉద్యేశించిందే.. అందుకే ‘బిగ్గెస్ట్‌ బ్లాక్‌బాస్టర్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా ఇలా సూపర్‌ స్టార్‌లందరిని ఒకే చోట చూడటం చాలా బాగుంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement