శ్రమదానంలో పాల్గొన్న అగ్రహీరో, హీరోయిన్‌ | Aamir Khan And Alia Bhatt Participated In Shramadhan At Latur | Sakshi
Sakshi News home page

శ్రమదానంలో పాల్గొన్న అగ్రహీరో, హీరోయిన్‌

Published Tue, May 1 2018 2:29 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Aamir Khan And Alia Bhatt Participated In Shramadhan At Latur - Sakshi

‘కార్మిక దినోత్సవం’ సందర్భంగా బాలీవుడ్‌ ‘మిస్టర్‌ పర్ఫెక్షనిస్టు’ ఆమీర్‌ ఖాన్‌, హీరోయిన్‌ అలియా భట్‌ మహారాష్ట్రలోని లాథూర్‌లో నిర్వహించిన ‘మహాశ్రమదాన్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పాని’ ఫౌండషన్‌ అధ్వర్యంలో నిర్వహించిన ఈ శ్రమదానంలో ఆమీర్‌, అలియా పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. లాథూర్‌లో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. లాథూర్‌ గ్రామ ప్రజల దాహాన్ని తీర్చడానికి రైలు​ బోగీల ద్వారా నీటిని సరఫరా చేసిన విషయం విదితమే. ఇలాంటి కరువు ప్రాంతంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్‌ అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చో ప్రజలకు తెలియజేయడానికి ‘పాని’ సంస్థ ఈ శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించింది.

మే, 1న దేశమంతటా ‘కార్మిక దినోత్సవం’ జరుపుకుంటుంటే మహారాష్ట్రీయులు మాత్రం ‘కార్మిక దినోత్సవం’తో పాటు ‘మహారాష్ట్ర దివాస్‌’ను కూడా జరుపుకుంటారు. ఈ పర్వదినం సందర్భంగా గ్రామీణులతో భుజం భుజం కలిపి శ్రమదానం చేసి కరువుకు వ్యతిరేకంగా పోరాడి ‘జలమిత్రులు’గా మారండని ఆమీర్‌ఖాన్‌ ఏప్రిల్‌ 19న పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. పాని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మే 1 న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. దాని అములులో భాగంగానే ఈ రోజు లాతూర్‌లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అమీర్‌ ఖాన్‌తో పాటు అలయా భట్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమీర్‌ ఖాన్‌  మాట్లాడుతూ ‘తొలుత తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మిగతా కరువు ప్రాంతాలకు అనంతరం పట్టణాలకు కూడా విస్తరిస్తామని’ తెలిపారు. ఆమీర్‌ ఖాన్‌తో కలిసి ఇలా శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అలియా భట్‌ అన్నారు. ప్రస్తుతం అలియా ‘కళంక్‌’ చిత్రంలో నటిస్తుంది.

పాని ఫౌండేషన్‌.....
ప్రజలకు వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి అవగాహన కల్పించడానికి 2016 సంవత్సరంలో  ఆమీర్‌ ఖాన్‌ ఆయన సతీమణి కిరణ్‌ రావ్‌తో కలిసి ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా ఈ ‘పాని’ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ ఫౌండేషన్‌ ప్రధాన ధ్యేయం జనాలకు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ఎలా అనే అంశం గురించి అవగాహన కల్పిచండం. అందుకు గాను ఈ పాని సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల మధ్య ‘వాటర్‌ కప్‌’ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీల్లో వాటర్‌షెడ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన గ్రామాలను గుర్తించి వాటికి బహుమతిని కూడా ఇస్తారు.

మొదటి స్థానంలో నిలిచిన గ్రామానికి 75లక్షల రూపాయల నగదు బహుమతి తర్వాతి స్థానాల్లో నిలిచిని వారికి వరుసగా 50, 45లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి చేరువచేయ్యడినికి గాను 2018, మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలమిత్ర అనే నూతన కార్యక్రమాన్ని రూపొందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement