తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటవలే విశవిద్యాలయాల వీసీల రాజీనామాలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం, గవర్నర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సవాల్ విసిరారు గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని ముఖ్యమంత్రి ఒక్క ఉదాహరణ చూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజకీయ జోక్యం అంటూ సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.
‘ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారిని తీసుకొచ్చేందుకే ఈ పని చేస్తున్నానని వారు తరుచుగా చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కాకుండా, ఏ వ్యక్తినైనా నా అధికారంతో నామినేట్ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తా. దానిని నిరూపించకపోతే ఆయన(సీఎం విజయన్) రాజీనామా చేసేందుకు సిద్ధమేనా? నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని సీఎం చెబుతున్నారు. వారు విద్యారంగాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెబుతున్నారు. సరైన అర్హత లేని, అనర్హులైన సీపీఎం లీడర్ల బంధువులతో నియామకాలు చేపట్టి ఎలా సాధిస్తారు?’ అని సీఎంపై విమర్శలు గుప్పించారు గవర్నర్ ఆరిఫ్ ఖాన్.
కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపైనా విమర్శలు గుప్పించారు గవర్నర్. స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తున్నట్లు గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంకి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయని స్పష్టం చశారు.
ఇద చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం
Comments
Please login to add a commentAdd a comment