
కేరళలోని వయనాడ్ బాధితులకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ అండగా నిలిచారు. బాధితుల సహయార్థం సీఎం సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పలువురు సినీతారలు సాయం అందించారు. మలయాళ నటులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం విరాళాలు ఇచ్చారు.
ధనుశ్ ఇటీవలే రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. గతనెల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment