kerala cm pinarayi vijayan
-
వయనాడ్ బాధితులకు అండగా మరో స్టార్ హీరో!
కేరళలోని వయనాడ్ బాధితులకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ అండగా నిలిచారు. బాధితుల సహయార్థం సీఎం సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పలువురు సినీతారలు సాయం అందించారు. మలయాళ నటులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం విరాళాలు ఇచ్చారు.ధనుశ్ ఇటీవలే రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. గతనెల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
Kerala CM Pinarayi Vijayan: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతోపాటు, పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటమెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్‌తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డీఎంకే నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలకు కేంద్రమే కారణమన్న ఎల్డీఎఫ్ వాదనను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
‘రాజీనామాకు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటవలే విశవిద్యాలయాల వీసీల రాజీనామాలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం, గవర్నర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సవాల్ విసిరారు గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని ముఖ్యమంత్రి ఒక్క ఉదాహరణ చూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజకీయ జోక్యం అంటూ సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఆర్ఎస్ఎస్కు చెందిన వారిని తీసుకొచ్చేందుకే ఈ పని చేస్తున్నానని వారు తరుచుగా చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కాకుండా, ఏ వ్యక్తినైనా నా అధికారంతో నామినేట్ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తా. దానిని నిరూపించకపోతే ఆయన(సీఎం విజయన్) రాజీనామా చేసేందుకు సిద్ధమేనా? నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని సీఎం చెబుతున్నారు. వారు విద్యారంగాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెబుతున్నారు. సరైన అర్హత లేని, అనర్హులైన సీపీఎం లీడర్ల బంధువులతో నియామకాలు చేపట్టి ఎలా సాధిస్తారు?’ అని సీఎంపై విమర్శలు గుప్పించారు గవర్నర్ ఆరిఫ్ ఖాన్. కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపైనా విమర్శలు గుప్పించారు గవర్నర్. స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తున్నట్లు గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంకి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయని స్పష్టం చశారు. ఇద చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం
తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు వివాదం ముదురుతోంది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వర్సిటీ విద్యార్థుల దగ్గర ప్రసంగాలు చేశారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్‌కు గవర్నర్ సూచించారు. ఆర్థిక మంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అర్థం వచ్చేలా బుధవారం లేఖ రాశారు. గవర్నర్ డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు. యూపీ నుంచి వచ్చే విద్యార్థులకు కేరళలో పరిస్థితులు అర్థం కావడం సంక్లిష్టంగా ఉంటుందని ఈ నెల 18న కేరళ వర్సిటీలో విద్యార్థుల సమావేశంలో బాలగోపాల్ అన్నారు. ‘‘మంత్రి తన ప్రమాణాన్ని మరిచారు. దేశ ఐక్యత, సమగ్రతలను తక్కువ చేసి చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఆయన నా విశ్వాసాన్ని కోల్పోయారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రిపై తనకు పరిపూర్ణ విశ్వాసముందంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఆయనను తప్పించడానికి ఏ కారణాలూ లేవన్నారు. కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అంశంలో ఇప్పటికే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. -
నిరాడంబరంగా సీఎం కుమార్తె వివాహం
సాక్షి, తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పెద్ద కుమార్తె టీ వీణ వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది. సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్ తిరువనంతపురంలో వీణను పెళ్లాడారు. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రహీమ్ సహా మొత్తం 50 మంది అతిథులు పాల్గొంటారు. అనంతరం ట్విటర్లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా వీణ 2014లో బెంగళూరులో ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ సంస్థను నెలకొల్పి దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అబ్దుల్ ఖాదర్ కుమారుడు అయిన మహ్మద్ రియాజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో కేసిఆర్ భేటీ
-
శబరిమలలో తిరుమల మాదిరి సౌకర్యాలు
తిరువనంతపురం: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాదిరి శబరిమలలో కూడా అయ్యప్ప భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ త్వరలో తిరుమల సందర్శించి అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులు, వసతుల కల్పనపై అధ్యయనం చేయనున్నట్లు దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారన్నారు. శబరిమల ఆలయం నవంబర్-జనవరి మూడు నెలలే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లక్షలమంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. మళయాళ కేలండర్ ప్రకారం ఈ సీజన్లో పూజల కోసం నెలకు ఐదు రోజులు మాత్రమే ఆలయం తెరుస్తారు. ఈ సీజన్లో జనవరి 14 మకర విళక్కు వరకు ఆలయానికి రూ.225 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాది ఇదే సీజన్లో లభించిన దానికంటే రూ.45 కోట్లు అధికమని మంత్రి వివరించారు. ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం మళ్లిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఇక్కడ భక్తుల కోసం సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కోట్లలో ఖర్చు పెడుతోందన్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాలకు ఈ సీజన్లో రూ.38 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. సన్నిధానం పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్‌ను నిషేధించామని, కేరళ వాటర్ అథారిటీ ఔషధపరమైన నీటిని యాత్రికులకు అందిస్తోందని మంత్రి సురేంద్రన్ చెప్పారు. -
పినరాయ్ విజయన్‌పైనే వారి ఆశలు
తిరువనంతపురం: కబేళాలకు తరలించేవారికి పశువులను విక్రయించరాదంటూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల ప్రభావం కేరళ మార్కెట్‌పై అప్పుడే కనిపించింది. కేంద్రం ఆంక్షలు ఇంకా అమల్లోకి రానప్పటికీ కేరళలోని మల్లప్పురం జిల్లా చెలేరి పశువుల సంత మంగళవారం బోసి పోయింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రతి వారం చెలేరి సంతకు 50 ట్రక్కులకుపైగా పశువులను తరలించుకు వచ్చేవారు వ్యాపారులు. పశువుల్లో బర్రెలు, ఎద్దులే ఎక్కువగా ఉండేవి. నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఓ ప్రైవేటు మైదానంలో జరిగే ఈ సంతకు ఎప్పుడూ ఎంతో డిమాండ్ ఉండేది. మొన్న 20 ట్రక్కులు ఖాళీగా సంత స్థలంలోనే ఉండిపోయాయి. ఈ వాహనాలు ఊరూరా తిరిగి విక్రయించే పశువులను సంతకు తీసుకొచ్చేవి. ప్రతి వారం ఈ సంతలో వెయ్యి పశువులకు డిమాండ్ ఉంటుందట. మొన్న 300 పశువులకు కూడా డిమాండ్ లేదు. పరిస్థితులను ముందే ఊహించిన రైతులు పశువులను సంతకు తరలించలేదు. 'నేను ప్రతివారం 50 పశువులను సంతకు తీసుకొచ్చి అమ్ముతాను. ఈ సారి 20 పశువులను కూడా అమ్మలేక పోయాను' వెంగరలో గొడ్ల శాలను కలిగిన బవుట్టి తెలిపారు. ఈ వ్యాపారాన్ని ఇంతటితో ఆపేయాల్సి వస్తుందా ? అని పశువుల వ్యాపారులు ఒకరినొకరు పలకరించుకోవడం కనిపించింది. ఉపాధి కోసం మరే వ్యాపారం చేయాలో అంతుచిక్కడం లేదని కొంత మంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం దెబ్బతినకుండా తమ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న విశ్వాసం ఎక్కువ మందిలో కనిపించింది. కేంద్రం విధించిన ఆంక్షలను అమలు చేయమని, సుప్రీం కోర్టు వరకు వెళతానని విజయన్ హెచ్చరించిన విషయం తెల్సిందే. నాలుగు టన్నుల బర్రె లక్ష రూపాయలకు, టన్ను బరువుండే బర్రెలు 20వేలకు, ఎద్దులు 20 వేల రూపాయల నుంచి 60 వేలకు ఈ సంతలో అమ్ముడు పోయేవి. -
కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్–నీల్
-
కేరళతో త్వరలో ఐటీ ఒప్పందం
-
ముందడుగుకు ‘నవ కేరళ’
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేరళ సీఎం పినరయి విజయన్ - సామాజిక న్యాయం కోసం కార్యాచరణ ప్రణాళిక అమలు - తమ్మినేని పాదయాత్ర దేశంలోనే రికార్డని కితాబు సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ‘నవ కేరళ’ పేరిట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందుకెళ్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. విద్యారంగం పటిష్టత, మెరుగైన వైద్యం, లక్షలాది మందికి ఇళ్లు, సేంద్రియ పద్ధతుల్లో ఉద్యానవన పంటలు, కూర గాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధన వంటివి ఈ ప్రణాళికలో భాగమన్నారు. వైద్య, ఆరోగ్య కేంద్రాల బలోపేతం, పెద్ద జబ్బులకు అందరికీ ఉచిత వైద్యం, తాలుకా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. సొంత ఇళ్లు లేని లక్షలాది మందికి ఇళ్లు సమకూర్చడం తోపాటు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా రాష్ట్రాభి వృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించామన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాద యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన నేపథ్యంలో పినరయి విజయన్ ‘సాక్షి’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మాది పేదల అనుకూల రాష్ట్రం. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళ ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారు. గౌరవప్రదమైన వేతన విధానమే అందుకు కారణం. తెలంగాణతో మాకు సత్సంబం ధాలే ఉన్నాయి. తెలంగాణలో 4.5 లక్షల మంది మలయాళీలున్నారు. కేరళలోనూ తెలుగువారు చాలా మందే ఉన్నారు. శబరి మలకు ఏటా 3.5 లక్షల మంది రాష్ట్రం నుంచి వస్తుంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌నే కాకుండా పంచవర్ష ప్రణాళిక, మరెన్నింటినో రద్దు చేసింది. అయినా కేరళలో సబ్‌ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేస్తు న్నాం. జనాభా ప్రాతిపదికనే కాకుండా అంత కు మించి ఈ వర్గాలకు కేటాయింపులు కేరళ ప్రత్యేకత. మేము పంచవర్ష ప్రణాళికనూ అమలు చేస్తున్నాం. అధికారాల వికేంద్రీక రణ, నిధుల కేటాయింపు, ప్రభుత్వ జోక్యం లేకపోవడం వంటి కారణాలు కేరళలో స్థానిక సంస్థల సమర్థ నిర్వహణకు దోహదపడుతు న్నాయి. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రుణం తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ రుణాలిచ్చేందుకు ఇష్టారీతిన నిబంధనలు పెట్టడమే మాకు అంగీకారం కాదు. తమ్మినేని నేతృత్వంలో 9 మంది సభ్యుల సీపీఎం బృందం 154 రోజులపాటు 4,200 కి.మీ పాదయాత్ర చేపట్టడం స్వతం త్ర భారతదేశ చరిత్రలో కొత్త రికార్డు. దీనికి ప్రజలు, మేధావులు, సామాజిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం హర్షణీయం. ఈ పరిణామం రాష్ట్రంలో సీపీఎంపై, మొత్తంగా వామపక్ష శక్తులకు అనుకూలంగా ఉంటుంది. అధికారంలోకి రాకముందు నేనూ కేరళలో పాదయాత్ర చేపట్టా. వివిధ వర్గాల ప్రజలను కలసి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర దోహదపడింది. -
కేరళతో త్వరలో ఐటీ ఒప్పందం
- సీఎం కేసీఆర్ వెల్లడి.. కేరళ సీఎం విజయన్‌కు విందు - శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణంపై చర్చ - రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించిన సీఎం సాక్షి, హైదరాబాద్: సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. అక్కడే సీఎం కేసీఆర్‌తో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం వారి ఆలోచనలు పంచుకున్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చించటంతోపాటు త్వరలోనే కేరళ–తెలంగాణ మధ్య ఐటీ సంబంధ ఒప్పందం జరుగుతుందని వెల్లడించారు. అందుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిపారు. శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అందుకు త్వరగా భూమిని కేటాయించాలని విజయన్ను కేసీఆర్ కోరారు. ఇప్పటికే చేసుకున్న ఎంవోయూను ప్రస్తావించారు. స్థల కేటాయింపు అంశం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వద్ద పెండింగ్‌లో ఉందని విజయన్ వెల్లడించారు. తెలంగాణ నుంచి శబరిమలకు లక్షలాది మంది భక్తులు వెళ్తారని, అందుకే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచినందుకు విజయన్ అభినందనలు తెలిపారు. అవినీతిరహిత కొత్త పారిశ్రామిక విధానంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. టీఎస్ఐపాస్ విధాన ప్రతిని విజయన్‌కు అందజేశారు. విదేశీ కంపెనీల ఆసక్తి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్న సీఎం.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో సహా రాష్ట్రంలో అమలవుతున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. టూరిజం, హెల్త్ టూరిజం, హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ కంపెనీలు హైదరాబాద్‌లో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు, భౌగోళిక స్థితిగతులు, భూకంపరహిత వాతావరణం ప్రపంచ ఐటీ రంగాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న అంశాలుగా మంత్రి వివరించారు. ల్యాండ్ రికార్డుల భద్రత అంశం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రస్తావనకు వచ్చింది. నిజాంకాలం నాటి నుంచీ రికార్డులను భద్ర పరచిన తీరును వివరించిన సీఎం కేసీఆర్.. ఇటీవల ఉచితంగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఒకరిపై ఒకరు తమకున్న నమ్మకం, విశ్వాసంతో తెల్ల కాగితంపై చేసుకున్న సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 11.5 లక్షల దరఖాస్తులు అందాయని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా కేరళ సహజ సౌందర్యంపైనా ఇరువురు మాట్లాడుకు న్నారు. కేరళ భూతల స్వర్గం అని కేసీఆర్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధి కారులు పాల్గొన్నారు. -
కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్–నీల్
► సామాజిక న్యాయానికి ఐక్య ఉద్యమాలు: ఏచూరి ► హిందూ రాజ్యస్థాపన దిశగా మోదీ, సంఘ్ శక్తులు సందేశమిచ్చాయి ► యూపీ పీఠంపై ‘యోగి’ని కూర్చోబెట్టడమే అందుకు నిదర్శనం ► బీజేపీ, ఆరెస్సెస్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి: కేరళ సీఎం విజయన్ ► ముగిసిన తమ్మినేని మహాజన పాదయాత్ర.. సరూర్‌నగర్‌లో సీపీఎం భారీ సభ సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎరుపు, నీలం రంగు జెండాలను ఐక్యం చేస్తూ ప్రజా ఉద్యమాలను బలపరుస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను సీఎంగా చేయడం ద్వారా ప్రధాని మోదీ, ఆరెస్సెస్, సంఘ్ పరివార్ శక్తులు హిందూ రాజ్యస్థాపన దిశగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయన్నారు. దళితులు, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై అగ్రకుల పెత్తందారీ విధానాలు అమలు కాబోతున్నాయని చెప్పారు. ఈ శక్తులు అధికారంలోకి రావడం వల్ల సామాజిక న్యాయ సాధన మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ‘సంక్షేమ, సామాజిక న్యాయ సమర సమ్మేళనం’పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. ‘‘ఇంద్రధనస్సులో మొదటనున్న ఎరుపు రంగు, చివరనున్న నీలం రంగు మధ్యలోని సమస్త రంగులు కలగలిసేలా ఉద్యమిద్దాం. సామాజిక న్యాయ సాధన కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు, హామీల అమలు కోసం ఒత్తిడి తెస్తాం. అన్ని రంగాలు, వర్గాలపై మోదీ ప్రభుత్వ దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. పోరాడి సాధించిన పథకాలు రద్దవుతున్నాయి. సబ్‌ప్లాన్ రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, ఇతర వర్గాలకు చెందిన రూ.73 వేల కోట్ల స్కాలర్షిప్పులు, బకాయిలు విడుదల చేయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారు. గోరక్ష సమితి ద్వారా దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. లాల్, నీల్ జెండాలు, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం కలవకపోతే ఇలాంటి దాడులు తట్టుకునే పరిస్థితి ఉండదు’’అని ఆయన అన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో తన సభకు ఆరెస్సెస్, సంఘ్ పరివార్ శక్తులు అడ్డంకులు సృష్టించినా.. అక్కడే అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన వీరభూమిలో ఎరుపు, నీలి జెండాలతో పాటు భగత్‌సింగ్ ఇంక్విలాబ్ నినాదాలతో ఉద్వేగభరితంగా సభ సాగిందని ఏచూరి చెప్పారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఐక్యతను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ‘‘దేశవ్యాప్తంగా అంబేద్కర్, వామపక్ష భావజాలంతో సామాజిక న్యాయం నినాదంతో అన్ని శక్తులు కలసి పనిచేయడం మొదలైందని, ఇది నిర్నిరోధంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన 4,200 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను చైనాలో మావో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌తో పోల్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్ తమ మిత్రుడిగా ఉన్నారని, ఆ తర్వాత మారిపోయారని ఏచూరి అన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలపై సీఎంకు తమ్మినేని రోజూ లేఖలు రాశారని, కేసీఆర్ ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలం గాణ సాయుధ పోరాటం భూసమస్యను దేశం ఎజెండాగా మార్చిందని, ఇక్కడ పోరాటాలు జరిగితే అవి దేశమంతా ప్రభావితం చేస్తాయ న్నారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సభకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీ లను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: విజయన్ బీజేపీ, సంఘ్ శక్తులు దేశాన్ని కాషాయీకరణ దిశగా తీసుకెళ్లేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. సీపీఎం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కాషాయీకరణతో దళితులు, మైనారిటీలతోపాటు మహిళలు కూడా తీవ్ర నిర్భందానికి, ఒత్తిళ్లు, కట్టుబాట్లకు గురవుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో భాగంగానే విశ్వవిద్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. సంఘ్ అరాచకాల వల్లే రోహిత్ వేముల, ముత్తుకృష్ణ వంటి తెలివైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కేంద్రం వినాశకరమైన విధానాలు అమలు చేస్తోంది. కేంద్రానికి రాష్టాలన్నా, రాష్ట్రాల హక్కులన్నా గౌరవం లేదు. దక్షిణాదిపై కక్ష కట్టింది. అందుకే ఈ రాష్ట్రాల్లో అశాంతి రేపాలని చూస్తోంది. భోపాల్‌లో, మంగళూరులో నా ఉపన్యాసాన్ని అడ్డుకోవాలని చూశారు. హైదరాబాద్ సభను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. వీటికి భయపడేది లేదు. మత ఘర్షణలు, పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ, ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే యూపీలో బీజేపీ గెలిచింది’’అని విజయన్ అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేదు ఉమ్మడి రాష్ట్రంలో అసమానతలపై పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలోనూ సామాజిక న్యాయం అమలు కావడం లేదని, కొందరు రాజకీయవేత్తలు భారీగా ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై పోరాడదాం
కేరళ సీఎంని కోరిన కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేష న్లు కల్పించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కోరారు. ఆది వారం గ్రాండ్ కాకతీయ హోటల్లో కేరళ సీఎంను కలసి 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బీసీ రిజర్వేషన్లపై కేరళ అసెంబ్లీ లోనూ తీర్మానం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు 50 శాతానికిపైగా రిజర్వేషన్లు దక్కుతాయని తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పిం చాలని, ప్రైవేటు రంగంలోనూ బీసీ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామన్నారు. -
కేసీఆర్ తో కేరళ సీఎం విజయన్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్ ఆదివారం భేటీ అయ్యారు. సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా నగరానికి వచ్చిన విజయన్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. భోజన విరామం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులూ రెండు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించారు. తెలంగాణలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల గురించి, ఐటీ, టూరిజం వంటి అంశాల గురించి విజయన్‌కు కేసీఆర్ వివరించారు. టీఆర్ఎస్ సర్కార్ పథకాల అమలు పట్ల విజయన్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, శబరిమలలో తెలంగాణ అతిథి గృహం నిర్మాణం కోసం త్వరగా భూకేటాయింపులు చేయాలని కేరళ సీఎంను కేసీఆర్ కోరారు. ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాకను నిరసిస్తూ ఆర్టీసీ కల్యాణ మండపం దగ్గర ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేరళలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కేరళ సీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!
కొచ్చి: కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. నాదపురం సమీపంలోని కళ్లాచీలో గురువారం రాత్రి జరిగిన ఈ బాంబు దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగటం గమనార్హం. సీఎం విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని కూడా ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్‌గా పనిచేస్తున్న చంద్రావత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బాంబు దాడి కచ్చితంగా సీపీఎం కార్యకర్తల పనే అని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విమర్శించారు. ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం ఆ సీఎంను చంపితే.. కోటి ఇస్తా: ఆర్ఎస్ఎస్ నేత -
బ్యాంకు ముందు సీఎం ధర్నా
-
బ్యాంకు ముందు సీఎం ధర్నా: మోదీపై ముప్పేట దాడి
తిరువనంతపురం: పట్టణాలు, నగరాల్లోని అన్ని బ్యాంకుల ముందు విపరీతమైన రద్నద్దీ ఉన్నందున గ్రామీణులను అందుబాటులో ఉండే సహకార బ్యాంకుల ద్వారా నగదు మార్పిడికి అవకాశం కల్పించాలని డిమాండ్ వస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు నిరాకరిస్తోంది.. దీంతో కొత్త నోట్లు వచ్చి పది రోజులు గడుస్తున్నా ప్రజల నోటు కష్టాలు రెట్టింపవుతున్నాయే తప్ప తగ్గడంలేదు. ఇటు విపక్షాలూ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నడుమ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా దక్షిణాది రాష్ట్రం కేరళ సీఎం పినరయి విజయ్ లు మోదీపై ముప్పేటదాడిని ముమ్మరం చేశారు. గ్రామీణులకు అందుబాటులో ఉండే సహకార బ్యాంకుల ద్వారా నగదు మార్పిడికి కల్పించని కేంద్రం తీరును నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏకంగా ఆర్బీఐ ముందు ధర్నాకు దిగారు. తన మంత్రివర్గ సహచరులు, విపక్ష నేతలు వెంటరాగా శుక్రవారం తిరువనంతపురంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం వద్ద సీఎం విజయన్ బైఠాయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా కొనసాగనుంది. వేలాదిగా హాజరైన ప్రజలను ఉద్దేశించి సీఎం విజయన్ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆకస్మికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆమేరకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవస్థీకృత సహకార బ్యాంకుల ద్వారా నగదు మార్పిడికి అవకాశం కల్పిస్తే గ్రామీణులకు మేలుచేసినట్లవుతుందని అన్నారు. కేరళ రాష్ట్ర సహకార బ్యాంకుల వ్యవస్థలో అక్రమాలు జరిగాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను సీఎం ఖండించారు. సీఎం పిలపునకు స్పందించి విపక్షాలు కూడా అధికారపార్టీతో కలిసి నడవటం గమనార్హం. మరోవైపు ఎరువులు, విత్తనాల కొనుగోళ్లకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. రైతుల నుంచి పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవద్దని ఎరువులు శాఖకు సూచించింది. దీంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
పోలీసులు లంచగొండులు కాకూడదు..
తిరువనంతపురంః లంచగొండితనానికి, అవినీతికీ పోలీసులు దూరంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బంది మోసపూరిత ప్రవర్తనను ఏమాత్రం దరికి చేరనీయకూడదంటూ అవినీతికి వ్యతిరేకంగా ఓ బలమైన సందేశాన్ని ఇచ్చారు. పోలీసులు లంచాలు తీసుకోవడం కంచే చేను మేసిన చందంగా ఉంటుందని విజయన్ ఉదహరించారు. అవినీతి రహిత విధానాలతో ఉండే పోలీసు వ్యవస్థ రాష్ట్రానికి ఎంతో అవసరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రత్యేక సాయుధ పోలీస్ క్యాంపులో శిక్షణ పూర్తి చేసిన పోలీసుల పాసింగ్ పెరేడ్ కు హాజరైన ఆయన... అవినీతికి వ్యతిరేకంగా పోలీసులు పనిచేయాలని సూచించారు. థర్డ్ డిగ్రీ టార్చరింగ్ పద్ధతిలో లంచగొండి తనాన్ని పారద్రోలాలని విజయన్ తెలిపారు. క్రిమినల్ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన... రాష్ట్ర పోలీసు దళాల్లో బలాన్ని, అవస్థాపన సౌకర్యాలను పెంచనున్నట్లు ప్రకటించారు. -
అంజూ జార్జిని వేధిస్తున్న కొత్త క్రీడల మంత్రి
తిరువనంతపురం: తనను క్రీడలశాఖ మంత్రి వేధింపులకు గురిచేశాడని ప్రముఖ క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె తన ఫిర్యాదు వివరాలతో కూడిన లేఖను ముఖ్యమంత్రికి అందించింది. తొలిసారి జరిగిన సమావేశంలోనే క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్ తనను, తనతోపాటు ఉన్న ఇతర సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. ప్రస్తుతం అంజూ కేరళ క్రీడల మండలి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆమె, తన మండలి సభ్యులు తొలిసారి వెళ్లి క్రీడాశాఖ మంత్రిని కలిశారు. అయితే వారిని ప్రతిపక్షానికి మద్ధతుదారులని తిట్టారని, మున్ముందు తమ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బెంగళూరు నుంచి కేరళకు అంజూ విమానంలో ప్రయాణించారంట. అయితే, ఈ కారణంతో ఆమె.. తన కౌన్సిల్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని, అయితే, తమకు ట్రావెల్ అలవెన్సులు ఆర్థికశాఖ మంజూరు చేసిందని ఆమె చెప్పారు. ఒక శాఖకు సంబంధించి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆ శాఖ ఎలా పనిచేస్తుందో విధివిధానాలు ఏమిటో ఓ మంత్రి కనీసం తెలుసుకోకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. తమ మండలి తీసుకున్న ట్రాన్స్ఫర్ల నిర్ణయాన్ని కూడా మంత్రి రద్దు చేశారని సీఎంకు చెప్పారు. ఈ విషయంలో తాను ప్రశ్నిస్తే బెదిరించారని అన్నారు. తనకు ప్రభుత్వంలో ఏదో స్థానంలో ఉండాలనో, అధికారం కావాలనో పెద్ద ఆశ కూడా లేదని చెప్పారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన ముఖ్యమంత్రి సానూకూలంగా స్పందించారు. తాను స్వయంగా ఈ విషయం గురించి తెలుసుకుంటానని అన్నారు.