బీసీ రిజర్వేషన్లపై పోరాడదాం
కేరళ సీఎంని కోరిన కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేష న్లు కల్పించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు. ఆది వారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో కేరళ సీఎంను కలసి 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
బీసీ రిజర్వేషన్లపై కేరళ అసెంబ్లీ లోనూ తీర్మానం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు 50 శాతానికిపైగా రిజర్వేషన్లు దక్కుతాయని తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పిం చాలని, ప్రైవేటు రంగంలోనూ బీసీ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామన్నారు.