MLA Krishnaiah
-
ఆ గురుకులాలను తక్షణమే ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు 119 బీసీ గురుకుల పాఠశాలలను తక్షణమే ప్రారంభించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేబినెట్ బీసీ సబ్‌కమిటీ సమావేశంలో భాగంగా 119 గురుకులాలను ప్రారంభిస్తామని గతేడాది డిసెంబర్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు వచ్చే విద్యాసంవత్సరం వాటిని ప్రారంభిస్తామని చెప్పడం సరికాదన్నారు. జనాభా సంఖ్యకు తగినన్ని గురుకులాలు లేకపోవడంతో వేలాది బీసీ విద్యార్థులు అడ్మిషన్ల కోసం కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లే సీఎం ఇస్తామనడం అన్యాయమన్నారు. దరఖాస్తుల సంఖ్యను పట్టించుకోకుండా అరకొర నిధులిస్తే ఎలాగని ప్రశ్నించారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాలని కృష్ణయ్య కోరారు. -
ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు పోరాటం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇచ్చేవరకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాగర్జన కార్యక్రమం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఖాళీ అయితే 6 నెలల్లోపు భర్తీ చేసినట్లే ఉద్యోగ ఖాళీలు ఏర్పడితే 3 నెలల్లోపు భర్తీ చేసేలా రాజ్యాంగాన్ని సవరించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని ప్రతి సభలో కేసీఆర్ చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా 10 వేల మందికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో నీల వెంకటేశ్, గుజ్జ కృష్ణ, నందగోపాల్, రామలింగం, వేముల రామకృష్ణ, రావుల కోల్ నరేశ్, గంగనబోయిన రాంబాబు, పి.సతీశ్, సుమారు 5 వేల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై పోరాడదాం
కేరళ సీఎంని కోరిన కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేష న్లు కల్పించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కోరారు. ఆది వారం గ్రాండ్ కాకతీయ హోటల్లో కేరళ సీఎంను కలసి 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బీసీ రిజర్వేషన్లపై కేరళ అసెంబ్లీ లోనూ తీర్మానం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు 50 శాతానికిపైగా రిజర్వేషన్లు దక్కుతాయని తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పిం చాలని, ప్రైవేటు రంగంలోనూ బీసీ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామన్నారు. -
ఖాళీలను భర్తీ చేయండి: ఆర్. కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడూతూ నిరుద్యోగుల పక్షాన ఉద్యమం చేస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలు తెలుగు సంక్షేమభవన్ వద్ద ధర్నాలు, ర్యాలీలు జరుపడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో మొత్తం ఒక లక్షా 7 వేల ఖాళీలున్నాయని, వీటిని నెల రోజుల్లో భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారని గుర్తు చేశారు. -
పార్టీలను చూసి ఓట్లేసే సంస్కృతి పోవాలి
బీసీల ఓట్లతో ఓసీలకు రాజ్యాధికారమా: ఆర్ కృష్ణయ్య జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పార్టీలను చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. తమ ఓట్లు తామే వేసుకున్నప్పుడే రాజ్యాదికారం సిద్ధిస్తుందని చెప్పారు. సోమవారం మహబూ బ్‌నగర్ లో నిర్వహించిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలSను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. బీసీల నాయ కత్వం రావాలని పిలుపునిచ్చారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సద్విని యోగం చేసుకో వాలని సూచించారు. ఒక్కశాతం ఉన్న ఓసీలు రాజ్యాధికారాన్ని అను భవిస్తున్నారని అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని కోరారు. బీసీల కోసం రూ.10 వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. -
మెస్ చార్జీలు,స్కాలర్షిప్లు పెంచాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్ : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమ దుస్థితి తెలియజేస్తూ విద్యార్థులు ఖాళీ ప్లేట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. ధర్నానుద్దేశించి కృష్ణయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లను పెంచాలని ఎన్నిమార్లు విన్నవించినా, ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వేతనాలను 3 నుంచి 10 రెట్లు పెంచారని, అందరికి తెలంగాణను బహుమతిగా ఇచ్చి తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులను మాత్రం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు.అరుుదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల మెస్‌చార్జీలను తక్షణం పెంచాలని కోరారు.సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 24 వందల వార్డెన్ల, వాచ్మెన్, కామాటి, కుక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. హాస్టళ్లలో ప్రతీ ఆదివారం మాంసాహార భోజనం పెట్టాలన్నారు. బీసీ నేతలు నీల వెంకటేష్, కుల్కచర్ల శ్రీనివాసు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నరిసింహగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఏఎస్పీ రవీందర్‌రెడ్డిని విచారించిన సిట్
నయీమ్ కేసు దర్యాప్తులో వేగం హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. మొన్నటికిమొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్యను విచారించిన సిట్ అధికారులు.. సోమవారం మాజీ అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డిని విచారించారు. రవీందర్‌రెడ్డిని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి... సిట్ ఏసీపీ సారుుకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఆయనతో పాటు నయీమ్ డ్రైవర్ శ్యామెల్ను కూడా విచారించారు. మూడున్నరేళ్ల పాటు భువనగిరిలో పనిచేసిన రవీందర్‌రెడ్డి... ఆ సమయంలో నయీమ్‌తో ఏర్పడిన పరిచయంతో పలు సెటిల్మెంట్లు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించారు. నయీమ్‌తో ఎప్పుడు ఎవరు ప్రయాణించింది... ఎక్కడెక్కడ కలిసేది వంటి వివరాలను శ్యామెల్ నుంచి రాబట్టినట్టు తెలిసింది. నయీమ్‌ను కలవలేదు: రవీందర్‌రెడ్డి సిట్ విచారణ అనంతరం రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నయీమ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను భువనగిరిలో పనిచేసిన మూడున్నరేళ్లలో నయీమ్ జైలులో ఉన్నాడని, ఎలాంటి కేసులూ డీల్ చేయలేదన్నారు. భువనగిరి తర్వాత చిత్తూరు, మెదక్‌లలో పనిచేసి పదవీ విరమణ పొందానని, ప్రస్తుతం నిజామాబాద్‌లో వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపారు. అరుుతే రిటైరరుున తరువాత తాను ఓసారి నయీమ్‌ను కలిశానన్న రవీందర్... అందుకు కారణం చెప్పలేదు. క్యూ కట్టిన బాధితులు: నయీమ్ బెదిరింపులకు భయపడి భూ డాక్యుమెంట్లు కోల్పోరుున బాధితులు నార్సింగ్ ఠాణా ఎదుట క్యూ కట్టారు. భువనగిరిలో లక్ష్మినరసింహస్వామి వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు నాలుగు వేల మందిని నయీమ్ అనుచరులు బెదిరించి ఆ భూములను అక్రమించి, డాక్యుమెంట్లు లాక్కున్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత నార్సింగ్ ఠాణా పరిధిలో అతడు నివాసముంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఆ భూముల డాక్యుమెంట్లు లభించారుు. -
బీసీలపై ముఖ్యమంత్రి కక్ష కట్టారు
ముషీరాబాద్: బీసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో రాష్ట్ర బిసి విద్యార్థి సంఘం విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ పథకాలను ఎత్తి వేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఫీజు బకాయిలను విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 8న కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు. 3నెలల క్రితం తాము చేసిన పోరాటం ఫలితంగా రూ.3100కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, నేడు కేవలం రూ.900కోట్లు మాత్రమే విడుదల చేసి విద్యార్థులను మోసం చేసిందన్నారు. ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థులకు నిబంధనలు విధించడం దారుణమన్నారు. బీసీలకు ఒక్క గురుకుల పాఠశాల కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నేతలు ర్యాగ అరుణ్, శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, విక్రమ్‌గౌడ్, నీర వెంకటేష్, చక్రధర్, మద్దూరి అశోక్‌గౌడ్, జి. కృష్ణ, బత్తిని రాజు పాల్గొన్నారు. -
జాబుల జాడే లేదు
ముషీరాబాద్: తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగమని, బాబు వస్తే జాబు వస్తుందని హామీలిచ్చిన కేసీఆర్, చంద్రబాబు గద్దెనెక్కి 27 నెలలు గుడుస్తున్నా ఉద్యోగాల జాడ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. సోమవారం ముషీరాబాద్‌లోని కషీష్ ఫంక్షన్హాల్లో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల నిరుద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు టీచర్ పోస్టులు మినహా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదన్నారు. ఏపీలో 1.45లక్షల ఖాళీలు ఉండగా, 10వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం నిర్ణయించడం దారుణమన్నారు. గ్రూప్ – 1,2,3 పోస్టులను పాత పద్దతిలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కాంట్రాక్టర్లకు, నీళ్లను సముద్రానికి, నియామకాలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటి వరకు కేవలం 3వేల ఇంజనీరింగ్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. గ్రూప్ – 2 సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సంస్కరణలు ఉద్యోగ భర్తీలో కాకుండా రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో గుజ్జకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, సయ్యద్ పాల్గొన్నారు. -
పోరాట ఫలితమే..!
ముషీరాబాద్: నిరుద్యోగుల పోరాట ఫలితంగానే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ముఖ్యమంత్రి నిరుద్యోగుల మన్ననలు పొందాలన్నారు. సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగాలను 1027 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం అభినందనీయమన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నోటిఫికేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నారన్నారు. 22 ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 11 శాఖల పరిధిలో 1027 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించటం దారుణమన్నారు. ప్రమోషన్లకు అలవాటు పడిన అధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాకు రావాల్సిన పోస్టులను వివిధ స్థాయిల్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న 40వేల టీచర్, గ్రూప్–3 కింద 8500 పోçస్టులను, గ్రూప్–4 ద్వారా 36వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, అంజి, రాంబాబు, బిక్షపతి, అరుణ్‌యాదవ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
⇒ ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఇబ్రహీంపట్నం రూరల్ : రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ లో గల శ్రీచైతన్యం ఇంజనీరింగ్ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, బీసీ ప్రంట్ అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్‌లు కలిసి మొక్కలు నాటారు. ఆనంతరం కళాశాలలో నూతన విద్యార్థులకు , తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ర్టంలో 2లక్షల ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. 40వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని నింపకుండా విద్య వలంటీర్లతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. మిషన్ భగీరథ పథకం పెద్ద స్కాం అని అన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. రాష్ర్ట బడ్జెట్లో రూ.36 వేల కోట్లు ఉద్యోగుల జీత భత్యాల కోసం కేటాయిస్తే ఉద్యోగుల భర్తీ చేయకపోవడం వల్ల రూ.10వేల కోట్లు మిగులుతున్నాయన్నారు. గ్రూప్-1,2,3,4 పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు రూ.40వేల కోట్లు కేటాయించినా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అందులో రూ.10 వేల కోట్లు అవినీతి జరిగి ఉంటుందని.. వెంటనే సీఎం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సునీల్, నారాయణరెడ్డి, నారాయణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి లేఖ రాయాలి
వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆర్.కృష్ణయ్య వినతి సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఇతర డిమాండ్ల పరిష్కారానికి పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమసంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వినతిపత్రాన్ని సమర్పించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడిని పెంచడానికి వైఎస్సార్సీపీ పక్షాన లేఖ రాయాలని జగన్‌ను కోరినట్లు ఆర్.కృష్ణయ్య తెలి పారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలసి 12 బీసీ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. పార్లమెంట్లో బీసీ బిల్లుపై కేంద్రానికి లేఖలు రాయాలని కోరేందుకు అన్ని పార్టీల అధ్యక్షులను కలుసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నా రు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, తదితర డిమాండ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు రోజుల్లో లేఖ రాస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమకు హామీ ఇచ్చారని తెలి పారు. బీసీల సమగ్రాభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని వైఎస్ జగన్ చెప్పారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీసీలకు చట్టసభల్లో 34 శాతం రిజర్వేషన్లు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌ను, ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీని అభినందించినట్లు తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగభద్రత కల్పించాలని, కేంద్ర విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 నుంచి 56 శాతానికి పెంచాలని వినతిపత్రంలో పొందుపరిచినట్లు కృష్ణయ్య చెప్పారు. ప్రతినిధి బృందంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమే శ్, నీల వెంకటేశ్, విక్రమ్‌గౌడ్ ఉన్నారు. -
బీసీ జాబితా ధర్మసత్రం కాదు
ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలన్న అంశంపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఘాటుగా స్పందించారు. ఎవరు పడితే వారు వచ్చి చేరడానికి బీసీ జాబితా ధర్మసత్రం కాదన్నారు. సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలనుకుంటే... జనాభా, ప్రాతినిధ్యం, వెనుకబాటుతనం, సామాజిక వివక్షత వంటి కారణాలతో ఇబ్బందిపడుతున్నవారిపై సమగ్ర సర్వే జరిపి రాజ్యాంగాన్ని అనుసరించి తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు. అంతేగాని అది రాజకీయపార్టీలు తీసుకునే నిర్ణయం కాదని, ఎవరి ఒత్తిడులకోసమో, బెదిరింపులకోసమో అన్ని రకాలుగా బాగున్న కాపులను బీసీల జాబితాలో చేర్చుతామంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీసీలు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారని, త్వరలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు. తెలంగాణ బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి వచ్చే ఏడాది ఆర్థిక బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీసీ యువతులకు కూడా ‘కల్యాణలక్ష్మి’ పథకం కావాలన్నారు. పది వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 25 నుంచి 52శాతంకు పెంచాలన్నారు. రాష్ట్రంలోని 250 బీసీ కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు లేవనీ వీటి నిర్మాణానికి రూ.750 కోట్లు కేటాయించాలని కోరారు. విదేశాలకు ఉన్నత చదువులు చదవడానికి వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. ముఖ్యమంత్రితో చర్చించి బీసీల బడ్జెట్‌ను పెంచుతామని మంత్రి ఈటల హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య తెలిపారు.