ఖాళీలను భర్తీ చేయండి: ఆర్. కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడూతూ నిరుద్యోగుల పక్షాన ఉద్యమం చేస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఎస్సీ,ఎస్టీ, బీసీలు తెలుగు సంక్షేమభవన్ వద్ద ధర్నాలు, ర్యాలీలు జరుపడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో మొత్తం ఒక లక్షా 7 వేల ఖాళీలున్నాయని, వీటిని నెల రోజుల్లో భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారని గుర్తు చేశారు.