పార్టీలను చూసి ఓట్లేసే సంస్కృతి పోవాలి
బీసీల ఓట్లతో ఓసీలకు రాజ్యాధికారమా: ఆర్ కృష్ణయ్య
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పార్టీలను చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. తమ ఓట్లు తామే వేసుకున్నప్పుడే రాజ్యాదికారం సిద్ధిస్తుందని చెప్పారు. సోమవారం మహబూ బ్‌నగర్ లో నిర్వహించిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలSను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. బీసీల నాయ కత్వం రావాలని పిలుపునిచ్చారు.
ఓటు అనే వజ్రాయుధాన్ని సద్విని యోగం చేసుకో వాలని సూచించారు. ఒక్కశాతం ఉన్న ఓసీలు రాజ్యాధికారాన్ని అను భవిస్తున్నారని అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని కోరారు. బీసీల కోసం రూ.10 వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.