ఓటుకు నోటు.. డబ్బులిస్తూ దొరికిపోయిన బీజేపీ నేత? | Maharashtra BJP leader accused of distributing cash for votes, he denies claim | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు.. డబ్బులిస్తూ దొరికిపోయిన బీజేపీ నేత?

Published Tue, Nov 19 2024 3:41 PM | Last Updated on Tue, Nov 19 2024 4:48 PM

Maharashtra BJP leader accused of distributing cash for votes, he denies claim

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతుంది.  పోలింగ్‌కు ఒకరోజు ముందు రాష్ట్ర బీజేపీ జనరల్‌ సెక్రటరీ వినోద్ తావ్డే పాల్ఘర్ జిల్లాలో ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. వినోద్‌ తావ్డే వద్ద ఉన్న బ్యాగ్‌లో సుమారు రూ.5 కోట్లు ఉన్నాయని బహుజన్ వికాస్ అఘాడి (బీవీఏ) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్ నాయక్‌, వినోద్‌ తావ్డేలు ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్ని, బీఏవీ చేస్తున్న ఆరోపణల్ని వినోద్‌ తావ్డే ఖండించారు.  

సమావేశం జరిగే హోటల్‌ గదిలో పలువురు వద్ద కరెన్సీ దర్శనమివ్వడం వివాదం తలెత్తింది. వినోద్‌ తావ్డే ఓటర్లకు డబ్బులు నోట్లను పంచుతున్నారంటూ బీవీఏ నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. ఆ  డబ్బులు బ్యాగ్‌ తనది కాదని చెప్పడం గమనించవచ్చు.

ఓటుకు నోటు ఘటనపై ఓ బీవీఏ నేత మాట్లాడుతూ.. తావ్డే తనని హోటల్‌ రూం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. తావ్డేతో పాటు వసాయ్‌ నుంచి పోటీ చేస్తున్న బీఏవీ ఎమ్మెల్యే అభ్యర్థులు హితేంద్ర ఠాకూర్, ఆయన కుమారుడు,నలసోపరా నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్తి క్షితిజ్ సైతం హోటల్‌ గదిలో ఉన్నట్లు తెలిపారు.  

తావ్డే తీరుపై బీవీఏ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ హోటల్‌ను సీజ్‌ చేసిన పోలీసులు..బీజేపీ జనరల్‌ సెక్రటరీ వినోద్ తావ్డేని భయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓట్స్ ఆరోపణలు

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement