ప్రసంగిస్తూనే సొమ్మసిల్లిన గడ్కరీ | Lok sabha elections 2024: Union Minister Nitin Gadkari Faints During Campaign Rally In Maharashtra | Sakshi
Sakshi News home page

ప్రసంగిస్తూనే సొమ్మసిల్లిన గడ్కరీ

Published Thu, Apr 25 2024 3:45 PM | Last Updated on Thu, Apr 25 2024 3:45 PM

పడిపోతున్న గడ్కరీని పట్టుకుంటున్న నేతలు - Sakshi

పడిపోతున్న గడ్కరీని పట్టుకుంటున్న నేతలు

యావత్మాల్‌(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని యావత్మాల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రసంగిస్తూనే వేదికపై కుప్పకూలారు. అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన ఆయన్ను పార్టీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ‘ఎండ వేడిమికి తాళలేక పుసాద్‌ సభలో అనారోగ్యానికి గురయ్యాను.

ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. వరుడ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’అంటూ కొద్దిసేపటి తర్వాత ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. నాగ్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి గడ్కరీ పోటీ చేస్తున్నారు. మొదటి విడతలో అక్కడ పోలింగ్‌ పూర్తయింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న యావత్మాల్‌లో పోలింగ్‌ జరగనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement