దీపిక పదుకొనెకు ఆలియా భట్ బాసట!
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వివాదస్పద కథనానికి స్పందించిన తీరుపై బాలీవుడ్ తార దీపికా పదుకొనె దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. బాలీవుడ్ తారలతోపాటు, క్రికెటర్లు బాసటగా నిలిచారు. అసభ్య కథనం వెల్లడించిన ఆంగ్ల దినపత్రికకు గట్టిగా బుద్ది చెప్పిందని ఆలియా భట్ ట్విట్ చేశారు.
దీపికా పదుకొనె వక్షోజ ప్రదర్శన చేసిందంటూ ప్రముఖ దినపత్రికకు చెందిన వెబ్ సైట్ కథనాన్నిప్రచురించింది. దాంతో నేను మహిళను, నాకు వక్షోజాలు ఉన్నాయి.. మీకు వచ్చిన సమస్యేమిటి?. మహిళను గౌరవించడం చాతకాకపోతే.. మహిళా చైతన్యం అంటూ మాట్లాడవద్దు అంటూ దీపిక ఘాటుగా స్పందించారు.