
జీవితారాజశేఖర్
హైదరాబాద్ ఫిల్మ్‌చాంబర్‌లోని నిర్మాతల మండలి హాలులో ఆదివారం (20వ తేదీ) తెలుగు సినిమా నటీనటుల సంఘం ‘మా’ జనరల్ ఆత్మీయ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ కార్యదర్శి జీవితారాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆదివారం జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళనం, ‘మా’ సమావేశం.. ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన సమావేశ వివరాలను ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు తెలియజేస్తున్నా. ఆదివారం 9గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సమావేశం జరిగింది.
28 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం పరిష్కరించుకోలేకపోయాం. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఆ సమావేశంలో ‘మా’ లాయర్ గోకుల్‌గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్‌గారు కూడా ఉన్నారు. ‘మా’లో ఉన్న 900 మందికిపైగా సభ్యుల్లో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే 21రోజుల్లోగా ‘ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ జరుగుతుంది. సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ‘మా’ ఆఫీసుకు వచ్చి సంతకాలతోనో, రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్ ద్వారానో, పోస్ట్ ద్వారానో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment